Chess: చెస్ ఒలింపియాడ్‌లో తొలిసారి ప్రవేశ పెట్టిన జ్యోతి యాత్ర ఎక్కడ మొదలైంది?
PM Modi To Inaugurate First-Ever Torch Relay For Chess Olympiad
చెస్ ఒలింపియాడ్‌లో తొలిసారి ప్రవేశ పెట్టిన జ్యోతి యాత్ర ఢిల్లీలో మొదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఒలింపియాడ్ జ్యోతియాత్రకు శ్రీకారం చుట్టారు. ఈసారి ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు భారత్ ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. చెస్ ఒలింపియాడ్ జూలై 28 నుంచి తమిళనాడులోని మహాబలిపురంలో జరగనుంది. ఒలింపిక్స్‌లో మాదిరిగానే చెస్ ఒలింపియాడ్ సందర్భంగా జ్యోతి యాత్ర చేపట్టాలని ఫిడె (ఎప్‌ఐడీఈ) ఇటీవలే నిర్ణయించింది.