T-20 World Cup-2021 : ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ గా డేవిడ్ వార్నర్..ఆ కసిలోంచి పుట్టిన ఆటనే..
నవంబర్ 14వ తేదీన(ఆదివారం) జరిగిన ఫైనల్లో ఎనిమిది వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలిసారిగా ఈ ఫార్మాట్‌లో వరల్డ్ టైటిల్ అందుకుంది ఆస్ట్రేలియా.
ఆ కసిలోంచి పుట్టిన ఆటనే..
కొద్ది రోజుల క్రితం ఇదే యూఏఈలో మ్యాచ్‌ల నుంచి తప్పించడమే కాదు, మైదానానికి కూడా రాకుండా హోటల్ గదికే డేవిడ్ వార్నర్‌ను ఐపీఎల్ టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ పరిమితం చేసింది. పిచ్‌పై ఆడాల్సిన వాడు ‘ఎక్స్‌ట్రా’ తరహాలో చప్పట్లు కొడుతూ డ్రింక్స్ అందించడం సగటు క్రికెట్ అభిమానిని ఆవేదనకు గురి చేసింది. ఆ కసిలోంచి పుట్టిన ఆటనే కావచ్చు, తానేంటో చూపించాలనే పట్టుదల కావచ్చు... నెల రోజులు తిరిగేసరికి ఏకంగా వరల్డ్‌కప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద టోరీ్న’గా వార్నర్ నిలిచాడు. సరైన సమయంలో తన జాతీయ జట్టు తరఫున సత్తా చాటి తొలి టైటిల్ అందించడంలో కీలకపాత్ర పోషించాడు. పరిమిత ఓవర్ల కోసం రెండేళ్ల క్రితం టెస్టులను వదిలి పెట్టిన మిచెల్ మార్‡్షను ఇప్పటి వరకు ‘బిట్స్ అండ్ పీసెస్’ తరహాలో ఆల్‌రౌండర్‌గా పరిగణిస్తూ వచి్చన ఆసీస్ కొన్నాళ్ల క్రితమే ప్రధాన బ్యాట్స్‌మన్ పాత్రను ఇస్తూ మూడో స్థానంలో ఆడే అవకాశం కల్పించింది. టోరీ్నలో ఏకంగా 147 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధించిన తనపై ఉంచిన నమ్మకాన్ని మార్‡్ష నిలబెట్టాడు. అతను ఆడని ఒకే ఒక మ్యాచ్‌లోనే ఆసీస్ ఓడిందంటే మార్‡్ష భాగస్వామ్యం ఎలాంటిదో అర్థమవుతుంది. ఫైనల్లో విజయం వైపు నడిపించిన వీరిద్దరే కాకుండా కీలక సమయాల్లో ఇతర ఆటగాళ్ల ప్రదర్శనలు ఆసీస్‌ను ముందంజంలో నిలిపాయి. సరిగ్గా చెప్పాలంటే ఎలాంటి ప్రత్యరి్థ, వేదిక ఎదురైనా ఏ సమయంలోనూ వెనకడుగు వేయని ఒకనాటి దుర్భేద్యమైన ఆస్ట్రేలియాను గుర్తుకు తెస్తూ ఈ బృందం సత్తా చాటింది.
గత ఐదు టి20 సిరీస్‌లు చూస్తే...
ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్ చేతుల్లో వరుసగా ఐదు సిరీస్ పరాజయాలు... కానీ అసలు సమయంలో తమ అత్యుత్తమ ఆటను ప్రదర్శించడంతో ఆసీస్ ఒక్కసారిగా ఎగసింది. సెమీఫైనల్లో వేడ్, స్టొయినిస్ హీరోలుగా నిలిస్తే బౌలింగ్‌లో హాజల్‌వుడ్, జంపా స్టార్‌లుగా నిలిచారు. ముఖ్యంగా ఇతర లెగ్‌స్పిన్నర్లతో పోలిస్తే జంపా ఇంతగా సూపర్ సక్సెస్ అవుతాడని ఎవరూ ఊహించలేదు. ఆరుకంటే తక్కువ ఎకానమీ (5.81)తో అతను 13 వికెట్లు తీసి ప్రత్యర్థులను పూర్తిగా కట్టి పడేశాడు. హాజల్‌వుడ్ కూడా పవర్‌ప్లేలో కీలక పాత్ర పోషిస్తూ 11 వికెట్లతో చెలరేగాడు. ఐపీఎల్‌లో చెన్నై తరఫున చక్కటి బౌలింగ్ ప్రదర్శనతో టైటిల్ సాధించడంలో భాగంగా ఉన్న హాజల్‌వుడ్ అదే అనుభవాన్ని ఇక్కడా ఉపయోగించాడు. కెపె్టన్ ఫించ్ మినహా (7 మ్యాచ్‌లలో 2 డకౌట్లు సహా 135 పరుగులు) మిగతా వారంతా ఏదో ఒక దశలో తమ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించడం ఆసీస్‌కు విజయాన్ని అందించింది. అయితేనేమి... ఆసీస్‌కు ప్రపంచకప్ అందించిన అలెన్ బోర్డర్, స్టీవ్ వా, రికీ పాంటింగ్, మైకేల్ క్లార్క్‌లవంటి దిగ్గజాల సరసన ఫించ్ చోటు దక్కించుకున్నాడు.
తొలి టి20 ప్రపంచకప్ సమయంలో ఆ్రస్టేలియా అద్భుత ఫామ్‌లో ఉంది. వన్డే వరల్డ్ కప్ విజయం తర్వాత ఇది కూడా వారిదే అనిపించింది. అయితే అనూహ్యంగా సెమీ ఫైనల్లో భారత్ చేతిలో ఓడిన టీమ్‌కు ఆ తర్వాత ఐదు ప్రయత్నాల్లోనూ టైటిల్ దక్కలేదు. లోపం ఎక్కడుందో అర్థం కావడం లేదంటూ ఆసీస్ మాజీ ఆటగాళ్లు పదే పదే చెబుతూ వచ్చారు. బిగ్‌బాష్ లీగ్ బ్రహా్మండంగా సక్సెస్ అయిన తర్వాత, కొత్త టి20 స్టార్లు వెలుగులోకి వచ్చినా కంగారూల సమస్య తీరలేదు. గత రెండు సార్లు (2014, 2016) టీమ్ కనీసం సెమీస్ కూడా చేరలేకపోయింది. అంచనాలు లేకపోవడమే పెద్ద బలం అన్నట్లుగా ఈసారి బరిలోకి దిగిన జట్టు చివరకు సాధించి చూపించింది. భారత్ చేతిలో వార్మప్ మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన తర్వాతైతే ఆ టీమ్‌పై ఎవరికీ నమ్మకం కూడా లేకుండా పోయింది. అయితే మ్యాచ్ మ్యాచ్‌కూ తమ ప్రదర్శనను మెరుగుపర్చుకుంటూ ముందుకు సాగింది. ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడినా దాని ప్రభావం రన్‌రేట్‌పై పడకుండా తర్వాతి మ్యాచ్‌లలో చెలరేగడంతో సెమీస్ బెర్తు దక్కింది. ఈ అవకాశాన్ని వదలరాదనే పట్టుదల ప్రదర్శించిన టీమ్ చివరకు జగజ్జేతగా నిలవగలిగింది.