Boxing: స్ట్రాండ్‌జా టోర్నీలో రెండు స్వర్ణాలు గెలిచిన తొలి భారతీయురాలు?
స్ట్రాండ్‌జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణ పతకం సాధించింది. బల్గేరియా రాజధాని సోఫియాలో ఫిబ్రవరి 27న ముగిసిన ఈ టోర్నీలో నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ 52 కేజీల విభాగంలో చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో నిఖత్ 4–1తో తెతియానా కోబ్ (ఉక్రెయిన్)పై విజయం సాధించింది. తద్వారా 73 ఏళ్ల చరిత్ర కలిగిన స్ట్రాండ్‌జా టోర్నీలో రెండు స్వర్ణ పతకాలు నెగ్గిన తొలి భారతీయ మహిళా బాక్సర్‌గా నిఖత్ గుర్తింపు పొందింది. 2019లోనూ నిఖత్ బంగారు పతకం సాధించింది.
48 కేజీల విభాగంలో.. నీతూకు స్వర్ణం..
స్ట్రాండ్‌జా స్మారక టోర్నీలోనే మహిళల 48 కేజీల విభాగంలోనూ భారత్‌కు స్వర్ణ పతకం లభించింది. హరియాణాకు చెందిన నీతూ ఫైనల్లో 5–0తో ఎరికా ప్రిసియాండ్రో (ఇటలీ)పై గెలిచింది. పసిడి పతకాలు నెగ్గిన నిఖత్, నీతూలకు 4 వేల డాలర్ల (రూ. 3 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది.
Commonwealth Games: మీరాబాయి చాను ఏ క్రీడలో సుప్రసిద్ధురాలు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్ట్రాండ్‌జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో స్వర్ణ పతకాలు సాధించిన భారతీయ మహిళలు?
ఎప్పుడు : ఫిబ్రవరి 27
ఎవరు : నిఖత్ జరీన్(52 కేజీల విభాగం), నీతూ(48 కేజీల విభాగం)
ఎక్కడ : సోఫియా, బల్గేరియా
ఎందుకు : ఫైనల్లో నిఖత్ 4–1తో తెతియానా కోబ్ (ఉక్రెయిన్)పై, నీతూ 5–0తో ఎరికా ప్రిసియాండ్రో (ఇటలీ)పై విజయం సాధించినందున..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్