Shooting: ప్రెసిడెంట్స్ కప్ టోర్నీలో స్వర్ణం సాధించిన షూటర్?
ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రెసిడెంట్స్ కప్ షూటింగ్ టోర్నీలో భారత షూటర్ మనూ భాకర్ స్వర్ణ పతకం సాధించింది. పోలాండ్‌లోని వ్రోక్లా నగరంలో నవంబర్ 9న జరిగిన 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ మిక్స్‌డ్ ఫైనల్లో మనూ (భారత్)–ఒజ్‌గుర్ వార్లిక్ (టర్కీ) జంట 557 పాయింట్లు స్కోరు చేసి బంగారు పతకం నెగ్గింది. ఫైనల్లో గ్జియా (చైనా)–పీటర్ ఒలెక్ (ఇస్తోనియా) జంటపై మనూ–వార్లిక్ జోడీ విజయం సాధించింది.
మరోవైపు భారత్‌కే చెందిన రాహీ సర్నోబత్ 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో రజత పతకం కైవసం చేసుకుంది. 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో రాహీ 31 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో నిలిచిన వెన్‌కాంప్ (జర్మనీ, 33 పాయింట్లు) స్వర్ణం గెలుచుకుంది.
చదవండి: భారత్ నుంచి 72వ జీఎంగా అవతరించిన క్రీడాకారుడు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రెసిడెంట్స్ కప్ షూటింగ్ టోర్నీలో స్వర్ణం సాధించిన భారత షూటర్?
ఎప్పుడు : నవంబర్ 9
ఎవరు : మనూ భాకర్
ఎక్కడ : వ్రోక్లా నగరం, పోలాండ్
ఎందుకు : 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ మిక్స్‌డ్ ఫైనల్లో మనూ (భారత్)–ఒజ్‌గుర్ వార్లిక్ (టర్కీ) జంట విజయం సాధించడంతో...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్