Chess: భారత్ నుంచి 72వ జీఎంగా అవతరించిన క్రీడాకారుడు?
కోల్‌కతాకు చెందిన 20 ఏళ్ల మిత్రభా గుహా.. భారత్ నుంచి 72వ గ్రాండ్ మాస్టర్ (జీఎం)గా అవతరించాడు. సెర్బియాలోని నోవి సాడ్ నగరంలో జరుగుతున్న మిక్స్ 220 టోర్నీలో జీఎం హోదాకు అవసరమైన మూడో జీఎం నార్మ్‌ను అతడు అందుకున్నాడు. 2021, అక్టోబర్ నెలలో బంగ్లాదేశ్‌లో జరిగిన షేక్ రసెల్ జీఎం టోర్నీలో మిత్రభా రెండో జీఎం నార్మ్‌ను సాధించాడు. అంతేకాకుండా జీఎం హోదా దక్కడానికి అవసరమైన 2500 ఎలో రేటింగ్‌నూ దాటాడు.
ఆర్‌సీబీ కోచ్‌గా నియమితులైన మాజీ క్రికెటర్?
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) బ్యాటింగ్ సలహాదారుడు, భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్‌కు ప్రమోషన్ లభించింది. అతడిని రెండేళ్ల కాలానికి జట్టు హెడ్ కోచ్‌గా నియమిస్తూ ఆర్‌సీబీ ఫ్రాంచైజీ నిర్ణయం తీసుకుంది.
చదవండి: మెక్సికో గ్రాండ్‌ప్రి రేసులో విజేతగా నిలిచిన రెడ్‌బుల్ డ్రైవర్?
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్ నుంచి 72వ గ్రాండ్ మాస్టర్ (జీఎం)గా అవతరించిన క్రీడాకారుడు?
ఎప్పుడు : నవంబర్ 9
ఎవరు : కోల్‌కతాకు చెందిన మిత్రభా గుహా
ఎక్కడ : నోవి సాడ్, సెర్బియా
ఎందుకు : మిక్స్ 220 టోర్నీలో జీఎం హోదాకు అవసరమైన మూడో జీఎం నార్మ్‌ను అతడు అందుకోవడంతో...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్