Skip to main content

Formula One Motor Race: మెక్సికో గ్రాండ్‌ప్రి రేసులో విజేతగా నిలిచిన రెడ్‌బుల్‌ డ్రైవర్‌?

Max Verstappen at mexico grand prix

ఫార్ములావన్‌ సీజన్‌లో భాగంగా జరిగిన మెక్సికో గ్రాండ్‌ప్రి–2021లో రెడ్‌బుల్‌ డ్రైవర్‌ మాక్స్ వెర్‌స్టాపెన్‌ విజేతగా నిలిచాడు. మెక్సికో రాజధాని మెక్సికో సిటీలో నవంబర్‌ 7న జరిగిన ప్రధాన రేసులో... 71 ల్యాప్‌ల దూరాన్ని వెర్‌స్టాపెన్‌ గంటా 38 నిమిషాల 39.086 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. సీజన్‌లో వెర్‌స్టాపెన్‌కిది తొమ్మిదో విజయం. 16.555 సెకన్ల తేడాతో హామిల్టన్‌ (మెర్సిడెస్‌) రెండో స్థానంలో నిలిచాడు. మూడో స్థానాన్ని పెరెజ్‌ (రెడ్‌బుల్‌) దక్కించుకున్నాడు.

అబ్బె బ్లిట్జ్‌ చెస్‌ టోర్నీని ఎక్కడ నిర్వహించారు?

లాత్వియా రాజధాని రిగాలో నవంబర్‌ 8న జరిగిన లిండోరస్‌ అబ్బె బ్లిట్జ్‌ చెస్‌ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం) ఎరిగైసి అర్జున్‌ మూడో ర్యాంక్‌లో నిలిచాడు. 18 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో వరంగల్‌కు చెందిన 18 ఏళ్ల అర్జున్‌ 13.5 పాయింట్లు సాధించాడు. మేటి ప్లేయర్లు కరువానా (అమెరికా), అరోనియన్‌ (అర్మేనియా) తదితరులపై అర్జున్‌ గెలిచాడు. షెవ్‌చెంకో (ఉక్రెయిన్‌–14 పాయింట్లు) విజేతగా నిలిచాడు.
 

చ‌ద‌వండి: అత్యధిక మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్స్‌ గెలిచిన ప్లేయర్‌?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : మెక్సికో గ్రాండ్‌ప్రి రేసులో విజేతగా నిలిచిన డ్రైవర్‌?
ఎప్పుడు : నవంబర్‌ 8
ఎవరు    : రెడ్‌బుల్‌ డ్రైవర్‌ మాక్స్ వెర్‌స్టాపెన్‌
ఎక్కడ    : మెక్సికో సిటీ, మెక్సికో
ఎందుకు : రేసులో 71 ల్యాప్‌ల దూరాన్ని వెర్‌స్టాపెన్‌ గంటా 38 నిమిషాల 39.086 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నందున...

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 09 Nov 2021 12:26PM

Photo Stories