ICC: హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న దివంగత క్రికెటర్?
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ముగ్గురు దిగ్గజ క్రికెటర్లకు ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు కల్పించింది. శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే, దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ షాన్ పొలాక్‌లతో పాటు ఇంగ్లండ్ దివంగత మహిళా క్రికెటర్ జెనెట్టె బ్రిటిన్‌లు ఈ జాబితాలో ఉన్నారు. దీంతో హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేర్చిన క్రికెటర్ల సంఖ్య 106కి చేరింది. జయవర్ధనే సభ్యుడిగా ఉన్న శ్రీలంక జట్టు 2014 టి20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచింది. వన్డే, టెస్టు ఫార్మాట్లలో 3 వేల పరుగులు, 300 వికెట్ల చొప్పున తీసిన తొలి క్రికెటర్‌గా షాన్ పొలాక్ ఘనతకెక్కాడు. బ్రిటిన్ 19 ఏళ్ల (1979–1998) పాటు టెస్టుల్లో ఇంగ్లండ్ మహిళల జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ఆమె 2017లో మరణించింది.
చదవండి: ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో చోటు దక్కించుకున్న క్రికెటర్లు?
ఎప్పుడు : నవంబర్ 13
ఎవరు : శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే, దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ షాన్ పొలాక్, ఇంగ్లండ్ దివంగత మహిళా క్రికెటర్ జెనెట్టె బ్రిటిన్
ఎందుకు : క్రికెట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్