FIFA World Cup 2022: ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం?
అరబ్ దేశం ఖతర్ వేదికగా 2022లో జరిగే ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు ఐదు సార్లు చాంపియన్ బ్రెజిల్ అర్హత సాధించింది. ప్రపంచ కప్ క్వాలిఫయర్స్ దక్షిణ అమెరికా రీజియన్ టోర్నీలో భాగంగా నవంబర్ 12న బ్రెజిల్‌ని సావోపాలో నగరంలో జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్ 10తో కొలంబియాపై విజయం సాధించింది. మరో ఆరు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ప్రపంచకప్‌కు అర్హత సాధించిన తొలి దక్షిణ అమెరికా జట్టుగా బ్రెజిల్ నిలిచింది.
2022 కామన్వెల్త్ గేమ్స్‌ను ఎక్కడ నిర్వహించనున్నారు?
ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జరిగే 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో (సీడబ్ల్యూజీ) అరంగేట్రం చేయనున్న మహిళల క్రికెట్ ఆరంభ మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. జూలై 29 నుంచి ఆగస్టు 7 వరకు క్రికెట్ ఈవెంట్ జరుగుతుంది. మ్యాచ్‌లన్నీ టి20 ఫార్మాట్‌లో బర్మింగ్‌హామ్‌లో ఉన్న ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం వేదికగా జరగనున్నాయి.
చదవండి: ఎవరి జీవిత విశేషాలతో షట్లర్స్ ఫ్లిక్ పుస్తకాన్ని రూపొందించారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : అరబ్ దేశం ఖతర్ వేదికగా 2022లో జరిగే ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు అర్హత సాధించిన జట్టు
ఎప్పుడు : నవంబర్ 12
ఎవరు : బ్రెజిల్
ఎక్కడ : సావోపాలో, బ్రెజిల్
ఎందుకు : ప్రపంచ కప్ క్వాలిఫయర్స్ దక్షిణ అమెరికా రీజియన్ టోర్నీలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్ 10తో కొలంబియాపై విజయం సాధించడంతో...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్