Skip to main content

మార్చి 2021 స్పోర్ట్స్

టోక్యో ఒలింపిక్స్‌ టార్చ్‌ రిలే కార్యక్రమం ప్రారంభించిన క్రీడాకారిణి?
Current Affairs
టోక్యో ఒలింపిక్స్‌ టార్చ్‌ రిలే’ కార్యక్రమం మార్చి 25న ప్రారంభమైంది. 2011లో భూకంపం, సునామీ, న్యూక్లియర్‌ విస్ఫోటనాల ద్వారా తీవ్రంగా నష్టపోయిన ఫుకుషిమా వద్ద ఈ జ్యోతిని వెలిగించి పరుగు ప్రారంభించారు. 2011 మహిళల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన జట్టులో సభ్యురాలైన అజుసా ఇవషిమిజు చేతుల మీదుగా ఈ కార్యక్రమం మొదలైంది. జపాన్‌లోని 47 ప్రాంతాల మీదుగా ప్రయాణించే టార్చ్‌ 121 రోజుల తర్వాత క్రీడల ప్రారంభం రోజైన జులై 23కు టోక్యో చేరుకుంటుంది. జపాన్‌ రాజధాని టోక్యో 2021, జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యో ఒలింపిక్స్‌ జరగనున్నాయి.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : టోక్యో ఒలింపిక్స్‌ టార్చ్‌ రిలే కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : మార్చి 25
ఎవరు : ఫుట్‌బాల్‌ క్రీడాకారిణి అజుసా ఇవషిమిజు
ఎక్కడ : ఫుకుషిమా, జపాన్‌

బహ్రెయిన్‌ గ్రాండ్‌ ప్రి విజేతగా నిలిచిన మెర్సిడెస్‌ డ్రైవర్‌?
ఫార్ములావన్‌ (ఎఫ్‌1) సీజన్‌ తొలి రేసు బహ్రెయిన్‌ గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ విజేతగా నిలిచాడు. బహ్రెయిన్‌లోని సాఖిర్‌లో మార్చి 28న జరిగిన ఈ రేసులో 56 ల్యాప్‌ల దూరాన్ని అందరికంటే ముందుగా గంటా 32 నిమిషాల 3.897 సెకన్లలో ముగించి హామిల్టన్‌ విజేతగా అవతరించాడు. హామిల్టన్‌ ఖాతాలో ఇది 96వ టైటిల్‌ కావడం విశేషం. పోల్‌ పొజిషన్‌ నుంచి రేసును ఆరంభించిన వెర్‌స్టాపెన్‌ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. బొటాస్‌ (మెర్సిడెస్‌) మూడో స్థానంలో నిలిచాడు.
బహ్రెయిన్‌ రాజధాని: మనామా; కరెన్సీ: బహ్రెయిన్‌ దినార్‌
బహ్రెయిన్‌ అధికార భాష: అరబిక్‌
బహ్రెయిన్‌ ప్రస్తుత రాజు: హమద్‌ బిన్‌ ఇసా అల్‌ ఖలీఫా
బహ్రెయిన్‌ ప్రస్తుత యువరాజు, ప్రస్తుత ప్రధాని: సల్మాన్‌ బిన్‌ హమద్‌ బిన్‌ ఇసా అల్‌ ఖలీఫా
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : బహ్రెయిన్‌ గ్రాండ్‌ ప్రి విజేతగా నిలిచిన మెర్సిడెస్‌ డ్రైవర్‌?
ఎప్పుడు : మార్చి 28
ఎవరు : లూయిస్‌ హామిల్టన్‌
ఎక్కడ : సాఖిర్, బహ్రెయిన్‌

ఓర్లియాన్స్‌ మాస్టర్స్‌ టోర్నిలో రన్నరప్‌గా నిలిచిన భారత జోడీ?
ఓర్లియాన్స్‌ మాస్టర్స్‌ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ పురుషుల డబుల్స్‌ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన పంజాల విష్ణువర్ధన్‌ గౌడ్‌–గారగ కృష్ణప్రసాద్‌ జంట రన్నరప్‌గా నిలిచింది. ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో మార్చి 28న జరిగిన ఫైనల్లో విష్ణువర్ధన్‌–కృష్ణప్రసాద్‌ ద్వయం 21–19, 14–21, 19–21తో ప్రపంచ 14వ ర్యాంక్‌ జోడీ బెన్‌ లేన్‌–సీన్‌ వెండీ (ఇంగ్లండ్‌) చేతిలో పోరాడి ఓడిపోయింది.
అలబామా స్కూళ్లలో మళ్లీ యోగా...
త్వరలో మళ్లీ యోగా పాఠాలు చెప్పేందుకు అమెరికా రాష్ట్రం అలబామాలోని స్కూళ్లు సిద్ధమవుతున్నాయి. ఇటీవలే అక్కడి రాష్ట్ర హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌ సభ యోగాపై నిషేధాన్ని తొలగిస్తూ ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదించింది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఓర్లియాన్స్‌ మాస్టర్స్‌ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్ని పురుషుల డబుల్స్‌ విభాగంలో రన్నరప్‌గా నిలిచిన భారత జోడీ
ఎప్పుడు : మార్చి 28
ఎవరు : పంజాల విష్ణువర్ధన్‌ గౌడ్‌–గారగ కృష్ణప్రసాద్‌ జంట
ఎక్కడ : పారిస్, ఫ్రాన్స్‌

ఆసియా ఆన్‌లైన్‌ చెస్‌లో స్వర్ణం సాధించిన క్రీడాకారుడు?
ఆసియా అండర్‌–14 ఆన్‌లైన్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ ‘బి’ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ కుర్రాడు వి. ప్రణీత్‌ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించాడు. తొలి బోర్డుపై ఆడిన ప్రణీత్‌ మొత్తం తొమ్మిది గేముల్లో ఏడింటిలో గెలిచి, ఒక ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిపోయాడు. 7.5 పాయింట్లతో ప్రణీత్‌ అగ్రస్థానంలో నిలిచి వ్యక్తిగత స్వర్ణాన్ని అందుకున్నాడు. మొత్తం 32 ఆసియా దేశాలు ఈ టోర్నీలో పాల్గొన్నాయి.
హెచ్‌సీయూ–ఈఎస్‌ఐ ఒప్పందం
హైదరాబాద్‌ సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌తో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ మార్చి 29న ఒప్పందం చేసుకుంది. ఒప్పందం ప్రకారం... వచ్చే ఐదేళ్ల పాటు విద్యా, పరిశోధన కార్యక్రమాలు, టీచింగ్, ఫ్యాకల్టీ మార్పిడి, హెచ్‌సీయూ ప్రాంగణంలో ఆస్పత్రి అభివృద్ధికి సాయం వంటి అంశాలపై హెచ్‌సీయూ–ఈఎస్‌ఐలు పరస్పర సహకారం అందించుకోనున్నాయి.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఆసియా అండర్‌–14 ఆన్‌లైన్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన క్రీడాకారుడు?
ఎప్పుడు : మార్చి 29
ఎవరు : వి. ప్రణీత్‌
ఎక్కడ : వ్యక్తిగత విభాగంలో

దున్నపోతుల పరుగు పందెంలో సరికొత్త రికార్డు
కర్ణాటక జానపద క్రీడ బురదమడిలో దున్నపోతుల పరుగు పందెం (కంబళ)లో ఒలింపియన్‌ ఉసేన్‌ బోల్ట్‌గా పేరుగాంచిన మంగళూరుకు చెందిన శ్రీనివాసగౌడ మరో రికార్డు సాధించాడు. నూరు మీటర్లను కేవలం 8.78 సెకన్లలో చేరి తన రికార్డ్‌ను తిరగరాశాడు. మార్చి 28న దక్షిణ కన్నడ జిల్లా బంట్వాళ తాలూకా కక్యేపదవులో జరిగిన కంబళ పోటీలో వంద మీటర్లను 8.78 సెకన్లలో అధిగమించి ప్రథమ స్థానంలో నిలిచాడు. 10 రోజుల క్రితం జరిగిన పందెంలో శ్రీనివాసగౌడ నూరు మీటర్లను 8.89 సెకన్లలో అధిగమించడం తెలిసిందే. శ్రీనివాసగౌడ కంబళ వీరునిగా గత 15 ఏళ్లలో 45 సార్లు ప్రథమస్థానంలో నిలిచి బహుమతులను పొందాడు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : దున్నపోతుల పరుగు పందెం (కంబళ)లో సరికొత్త రికార్డు
ఎప్పుడు : మార్చి 28
ఎవరు : శ్రీనివాసగౌడ
ఎక్కడ : కక్యేపదవు, బంట్వాళ తాలూకా, దక్షిణ కన్నడ జిల్లా

సస్పెన్షన్‌కు గురైన సీఆర్‌పీఎఫ్‌ చీఫ్‌ స్పోర్ట్స్‌ ఆఫీసర్‌?
సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌) చీఫ్‌ స్పోర్ట్స్‌ ఆఫీసర్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (డీఐజీ), అంతర్జాతీయ మాజీ స్విమ్మర్‌ ఖజాన్‌ సింగ్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. మహిళా కానిస్టేబుళ్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో ఖజాన్‌తోపాటు మరో కోచ్, ఇన్‌స్పెక్టర్‌ సుర్జీత్‌ సింగ్‌ను సస్పెండ్‌ చేసినట్లు సీఆర్‌పీఎఫ్‌ సీనియర్‌ అధికారి వెల్లడించారు.
దక్షిణాసియా క్రీడల్లో ఏడు స్వర్ణాలు...
56 ఏళ్ల ఖజాన్‌ సింగ్‌ 1986 సియోల్‌ ఆసియా క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి 200 మీటర్ల బటర్‌ఫ్లయ్‌ ఈవెంట్‌లో రజత పతకం సాధించాడు. పతకంతో దేశానికి పేరుతెచ్చిన అతనికి సీఆర్‌పీఎఫ్‌లో స్పోర్ట్స్‌ ఆఫీసర్‌గా ఉద్యోగమిచ్చారు. 1984లో ‘అర్జున’ అవార్డు పొందిన ఖజాన్‌ 1988 ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం, 1988 వరల్డ్‌ పోలీస్‌ గేమ్స్‌లో రజతం, 1989 దక్షిణాసియా క్రీడల్లో ఏడు స్వర్ణాలు సాధించాడు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : సస్పెన్షన్‌కు గురైన సీఆర్‌పీఎఫ్‌ చీఫ్‌ స్పోర్ట్స్‌ ఆఫీసర్, డీఐజీ, అంతర్జాతీయ మాజీ స్విమ్మర్‌?
ఎప్పుడు : మార్చి 31
ఎవరు : ఖజాన్‌ సింగ్‌
ఎందుకు : మహిళా కానిస్టేబుళ్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో...

పరుగుల రాణి పీటీ ఉష రికార్డు బద్దలుకొట్టిన అథ్లెట్‌?
Current Affairs
ఫెడరేషన్‌ కప్‌ మహిళల 200 మీటర్ల పరుగులో 23 ఏళ్లుగా అథ్లెటిక్స్‌ దిగ్గజం పీటీ ఉష పేరు మీద చెక్కు చెదరకుండా ఉన్న రికార్డును తమిళనాడుకు చెందిన ఎస్‌ ధనలక్ష్మి తిరగరాసింది. జాతీయ సీనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భాగంగా మార్చి 18న పంజాబ్‌లోని పాటియాలాలో జరిగిన 200 మీటర్ల సెమీఫైనల్‌ హీట్‌ను అందరి కంటే ముందుగా 23.26 సెకన్లలో ముగించిన ధనలక్ష్మి మొదటి స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించింది. దాంతో 1998లో ఇదే మీట్‌లో పీటీ ఉష నెలకొల్పిన 23.30 సెకన్ల రికార్డు కనుమరుగైంది.
రెజ్లర్‌ రితిక ఫొగాట్‌ ఆత్మహత్య
వర్ధమాన రెజ్లర్‌ రితిక ఫొగాట్‌ అనుమానాస్పద స్థితిలో మార్చి 17న మృతి చెందింది. ప్రఖ్యాత రెజ్లర్లు గీత, బబితా ఫొగాట్‌లకు కజిన్‌ అయిన 17 ఏళ్ల రితిక... హరియాణలోని చార్కీ దాద్రీ జిల్లాలోని మహవీర్‌ సింగ్‌ ఫొగాట్‌ స్పోర్ట్స్‌ అకాడమీలో శిక్షణ తీసుకుంటోంది. స్పోర్ట్స్‌ అకాడమీలోని తాను ఉంటున్న గదిలోనే ఫ్యాన్‌కు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : 200 మీటర్ల పరుగులో పీటీ ఉష రికార్డు బద్దలుకొట్టిన అథ్లెట్‌?
ఎప్పుడు : మార్చి 18
ఎవరు : ఎస్‌ ధనలక్ష్మి
ఎక్కడ : పాటియాలా, పంజాబ్‌

పరుగులో సరికొత్త రికార్డు నెలకొల్పిన కంబళ వీరుడు?
బురద మడిలో దున్నపోతులతో పరిగెత్తే కర్ణాటక గ్రామీణ క్రీడ కంబళ పోటీల్లో ఉసేన్‌ బోల్ట్‌ కంటే వేగంగా పరుగెత్తాడన్న రికార్డు సొంతం చేసుకున్న కర్ణాటక మంగళూరువాసి శ్రీనివాసగౌడ మరో ఘనతను సృష్టించాడు. మంగళూరు సమీపంలోని బెళ్తంగడి తాలూకా వేణూరు పెర్ముడ సూర్య– చంద్ర జోడు చెరువులో మార్చి 20న జరిగిన కంబళ పోటీలలో గతంలో నమోదైన అన్ని రికార్డులను బద్దలు కొట్టాడు. గతంలో కంబళ పోటీలో 100 మీటర్ల దూరాన్ని 11:21 సెకన్లలో, తర్వాత 9.37 సెకన్లలో అధిగమించినదే అత్యుత్తమ రికార్డులు కాగా, తాజా పోటీలలో ఏకంగా 8.96 సెకన్లలో చేరుకుని సరికొత్త రికార్డు సృష్టించాడు. పాత రికార్డులను శ్రీనివాసగౌడ తుడిచిపెట్టాడు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : పరుగులో సరికొత్త రికార్డు నెలకొల్పిన కంబళ వీరుడు?
ఎప్పుడు : మార్చి 20
ఎవరు : శ్రీనివాసగౌడ
ఎక్కడ : వేణూరు పెర్ముడ సూర్య– చంద్ర జోడు చెరువు, బెళ్తంగడి తాలూకా, మంగళూరు సమీపం

జాతీయ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో డబుల్స్‌ టైటిల్‌ గెలిచిన జంట?
జాతీయ హార్డ్‌ కోర్టు సీనియర్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో పురుషుల డబుల్స్‌ విభాగంలో పీసీ అనిరుధ్‌ (తెలంగాణ)–నిక్కీ పునాచా (ఆంధ్రప్రదేశ్‌) జంట విజేతగా అవతరించింది. హరియాణాలోని గురుగ్రామ్‌లో మార్చి 20న జరిగిన ఫైనల్లో టాప్‌ సీడ్‌ అనిరుధ్‌–నిక్కీ ద్వయం 4–6, 6–3, 10–5తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో రెండో సీడ్‌ ఇషాక్‌ అబ్దుల్లా–నితిన్‌ కుమార్‌ సిన్హా (పశ్చిమ బెంగాల్‌) జోడీపై విజయం సాధించింది.
మరోవైపు మహిళల డబుల్స్‌ విభాగంలో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగమ్మాయి రిషిక సుంకర తన భాగస్వామి సాయిసంహిత (తమిళనాడు)తో కలిసి టైటిల్‌ సొంతం చేసుకుంది. ఫైనల్లో రిషిక–సంహిత ద్వయం 7–5, 7–6 (7/2)తో సౌమ్య విజ్‌ (గుజరాత్‌)–సోహా (కర్ణాటక) జంటపై నెగ్గింది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : జాతీయ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో పురుషుల డబుల్స్‌ టైటిల్‌ గెలిచిన జంట?
ఎప్పుడు : మార్చి 20
ఎవరు : పీసీ అనిరుధ్‌ (తెలంగాణ)–నిక్కీ పునాచా (ఆంధ్రప్రదేశ్‌) జంట
ఎక్కడ : గురుగ్రామ్, హరియాణా

టీటీలో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత జంట?
టోక్యో ఒలింపిక్స్‌ వేదికగా టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ)లో తొలిసారి ప్రవేశపెట్టనున్న మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో భారత ప్రాతినిధ్యం ఖరారైంది. మార్చి 20న ఖతర్‌ రాజధాని దోహాలో ముగిసిన ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో భారత జంట ఆచంట శరత్‌ కమల్‌–మనిక బత్రా విజేతగా నిలిచి ‘టోక్యో’ బెర్త్‌ను దక్కించుకుంది. ఫైనల్లో శరత్‌ కమల్‌–మనిక జోడీ 8–11, 6–11, 11–5, 11–6, 13–11, 11–8తో టాప్‌ సీడ్, ప్రపంచ ఐదో ర్యాంక్‌ జంట సాంగ్‌ సు లీ–జియోన్‌ జిహీ (దక్షిణ కొరియా)పై సంచలన విజయం సాధించింది.
సియోల్‌ ఒలింపిక్స్‌లో తొలిసారి...
1988 సియోల్‌ ఒలింపిక్స్‌లో తొలిసారి టీటీ క్రీడకు చోటు కల్పించారు. పురుషుల, మహిళల సింగిల్స్, డబుల్స్‌ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌ నుంచి పురుషుల, మహిళల డబుల్స్‌ ఈవెంట్‌లను తొలగించి వాటి స్థానంలో టీమ్‌ ఈవెంట్‌కు స్థానం కల్పించారు. మూడు ఒలింపిక్స్‌ క్రీడల తర్వాత టీమ్‌ ఈవెంట్స్‌కు జతగా మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఈవెంట్‌ను ప్రవేశపెట్టాలని టోక్యో ఒలింపిక్స్‌ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో టీటీలో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత జంట?
ఎప్పుడు : మార్చి 20
ఎవరు : ఆచంట శరత్‌ కమల్‌–మనిక బత్రా
ఎక్కడ : దోహా, ఖతర్‌
ఎందుకు : ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో విజేతగా నిలిచినందున

మెక్సికో ఓపెన్‌ ఏటీపీ–500 టోర్నమెంట్‌ విజేత?
మెక్సికో ఓపెన్‌ ఏటీపీ–500 టోర్నీ విజేతగా జర్మనీ టెన్నిస్‌ స్టార్‌ జ్వెరెవ్‌ నిలిచాడు. మెక్సికోలోని అకాపుల్కో నగరంలో మార్చి 21న జరిగిన ఫెనల్లో జ్వెరెవ్‌ 6–4, 7–6 (7/3)తో సిట్సిపాస్‌ (గ్రీస్‌)ను ఓడించాడు. ఓవరాల్‌గా జ్వెరెవ్‌ కెరీర్‌లో ఇది 14వ సింగిల్స్‌ టైటిల్‌. 28 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో సింగిల్స్‌ చాంపియన్‌గా నిలిచిన తొలి జర్మనీ ప్లేయర్‌గా జ్వెరెవ్‌ గుర్తింపు పొందాడు. జ్వెరెవ్‌కు 88,940 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 64 లక్షల 41 వేలు)తోపాటు 500 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.
దుబాయ్‌ ఓపెన్‌ ఏటీపీ–500 టోర్నీ విజేత?
దుబాయ్‌ ఓపెన్‌ ఏటీపీ–500 టోర్నీ విజేతగా అస్లాన్‌ కరాత్సెవ్‌ (రష్యా) నిలిచాడు. మార్చి 21న ఫైనల్లో కరాత్సెవ్‌ 6–3, 6–2తో క్వాలిఫయర్‌ లాయిడ్‌ హారిస్‌ (దక్షిణాఫ్రికా)పై గెలిచాడు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : మెక్సికో ఓపెన్‌ ఏటీపీ–500 టోర్నీ విజేత?
ఎప్పుడు : మార్చి 21
ఎవరు : జర్మనీ టెన్నిస్‌ స్టార్‌ జ్వెరెవ్‌
ఎక్కడ : అకాపుల్కో, మెక్సికో

రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ టి20 క్రికెట్‌ టోర్నీ కప్‌ చాంపియన్‌?
రిటైర్డ్‌ క్రికెటర్లతో నిర్వహించిన రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ టి20 క్రికెట్‌ టోర్నీ కప్‌లో భారత్‌ లెజెండ్స్‌ జట్టు చాంపియన్‌గా నిలిచింది. చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో మార్చి 21న జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో సచిన్‌ టెండూల్కర్‌ కెప్టెన్సీలోని భారత జట్టు 14 పరుగుల తేడాతో శ్రీలంక లెజెండ్స్‌ జట్టును ఓడించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 181 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు చేసి ఓడింది. చత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బాఘేల్‌ చేతుల మీదుగా సచిన్‌ లెజెండ్స్‌ కప్‌ను అందుకున్నాడు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ టి20 క్రికెట్‌ టోర్నీ కప్‌ చాంపియన్‌?
ఎప్పుడు : మార్చి 21
ఎవరు : భారత్‌ లెజెండ్స్‌ జట్టు
ఎక్కడ : రాయ్‌పూర్, చత్తీస్‌గఢ్‌

బార్సిలోనా జట్టు తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌?
అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనల్‌ మెస్సీ మరో ఘనత సాధించాడు. 121 ఏళ్ల చరిత్ర కలిగిన విఖ్యాత క్లబ్‌ బార్సిలోనా జట్టు తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా అవతరించాడు. 767 మ్యాచ్‌లతో జావీ హెర్నాండెజ్‌ పేరిట ఉన్న రికార్డును 768వ మ్యాచ్‌తో మెస్సీ బద్దలు కొట్టాడు. ల లీగాలో భాగంగా రియల్‌ సోసిడాడ్‌ క్లబ్‌తో తాజాగా జరిగిన మ్యాచ్‌లో మెస్సీ బరిలోకి దిగి రెండు గోల్స్‌ కూడా చేశాడు. ఒకే క్లబ్‌ తరఫున ఆడుతూ అత్యధిక గోల్స్‌ (బార్సిలోనా–467 గోల్స్‌) చేసిన రికార్డు కూడా మెస్సీ పేరిటే ఉంది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : బార్సిలోనా జట్టు తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌?
ఎప్పుడు : మార్చి 22
ఎవరు : లియోనల్‌ మెస్సీ

ఐటీఎఫ్‌ గ్రేడ్‌–5 జూనియర్‌ బాలికల టోర్నీ విజేత?
Current Affairs
అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) గ్రేడ్‌–5 జూనియర్‌ బాలికల టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి సంజన సిరిమల్ల విజేతగా నిలిచింది. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో మార్చి 13న ముగిసిన ఈ టోర్నీలో 16 ఏళ్ల సంజన సింగిల్స్‌ ఫైనల్లో 4–6, 6–0, 6–0తో లక్షణ్య విశ్వనాథ్‌ (భారత్‌)పై గెలిచింది. 2019 నవంబర్‌లో గువాహటిలో చివరిసారి ఆమె టైటిల్‌ సాధించింది.
పంజాబ్‌ కింగ్స్‌ బౌలింగ్‌ కోచ్‌గా రైట్‌...
ఆస్ట్రేలియా మాజీ ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్‌ డేమియన్‌ రైట్‌ను తమ కొత్త బౌలింగ్‌ కోచ్‌గా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఫ్రాంచైజీ పంజాబ్‌ కింగ్స్‌ నియమించుకుంది. 45 ఏళ్ల రైట్‌ ఇప్పటికే బంగ్లాదేశ్‌ అండర్‌ –19 క్రికెట్‌ జట్టుకు హెడ్‌ కోచ్‌గా సేవలందిస్తున్నారు. రైట్‌ గతంలో బిగ్‌బాష్‌ లీగ్‌ జట్టు హోబర్ట్‌ హరికేన్స్, మెల్‌బోర్న్‌ స్టార్స్‌తో పాటు న్యూజిలాండ్‌ జాతీయ జట్టుకు బౌలింగ్‌ కోచ్‌గా పనిచేశాడు. ఐపీఎల్‌–2021 సీజన్‌ ఏప్రిల్‌ 9న మొదలవుతుంది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఐటీఎఫ్‌ గ్రేడ్‌–5 జూనియర్‌ బాలికల టోర్నీ విజేత?
ఎప్పుడు : మార్చి 13
ఎవరు : సంజన సిరిమల్ల
ఎక్కడ : డెహ్రాడూన్, ఉత్తరాఖండ్‌

ఐఎస్‌ఎల్‌ 2020–2021 సీజన్‌ చాంపియన్‌?
ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) 2020–2021 సీజన్‌లో ముంబై సిటీ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ) చాంపియన్‌గా అవతరించింది. ఏటీకే మోహన్‌ బగాన్‌ క్లబ్‌తో మార్చి 13న గోవాలోని మార్గోవాలో ఉన్న ఫటోర్డా స్టేడియంలో జరిగిన ఫైనల్లో ముంబై సిటీ జట్టు 2–1 గోల్స్‌ తేడాతో విజయం సాధించి తొలిసారి ఐఎస్‌ఎల్‌ ట్రోఫీని హస్తగతం చేసుకుంది.
విజేత ముంబై సిటీకి రూ. 8 కోట్లు... రన్నరప్‌ మోహన్‌ బగాన్‌కు రూ. 4 కోట్లు ప్రైజ్‌మనీ లభించాయి. ‘గోల్డెన్‌ బూట్‌’ అవార్డును సీజన్‌లో 14 గోల్స్‌ చేసిన ఇగోర్‌ (గోవా) దక్కించుకోగా... ‘గోల్డెన్‌ గ్లవ్‌’ అవార్డు మోహన్‌ బగాన్‌ గోల్‌కీపర్‌ ఆరిందమ్‌ భట్టాచార్య పొందాడు. బెంగళూరు తర్వాత (2018–2019 సీజన్‌) లీగ్‌ దశలో ‘టాప్‌ ర్యాంక్‌’లో నిలువడంతోపాటు టైటిల్‌నూ నెగ్గిన రెండో జట్టుగా ముంబై గుర్తింపు పొందింది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఐఎస్‌ఎల్‌ 2020–2021 సీజన్‌ చాంపియన్‌?
ఎప్పుడు : మార్చి 13
ఎవరు : ముంబై సిటీ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ)
ఎక్కడ : ఫటోర్డా స్టేడియం, మార్గోవా, గోవా

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌ ర్యాంక్‌ ఈమెదే
అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్‌ లిజెల్‌ లీ టాప్‌ ర్యాంక్‌ను అందుకుంది. భారత్‌తో జరుగుతున్న సిరీస్‌లో లిజెల్‌ లీ (83 నాటౌట్, 4, 132 నాటౌట్, 69) అద్భుత ప్రదర్శన చేసింది. దాంతో ఆమె ఎనిమిదో స్థానం నుంచి ఏకంగా అగ్రస్థానానికి ఎగబాకింది. ఈ ఘనత సాధించిన తొలి దక్షిణాఫ్రికా మహిళా క్రికెటర్‌గా ఆమె గుర్తింపు పొందింది. టాప్‌ ర్యాంక్‌లో ఉన్న బ్యూమోంట్‌ (ఇంగ్లండ్‌) రెండో స్థానానికి పడిపోయింది. భారత్‌ నుంచి స్మృతి మంధాన (7వ), మిథాలీ (9వ) టాప్‌–10లో ఉన్నారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్‌ లిజెల్‌ లీ టాప్‌ ర్యాంక్‌
ఎవరు : లిజెల్‌ లీ
ఎక్కడ : దక్షిణాఫ్రికా
ఎందుకు : భారత్‌తో జరుగుతున్న సిరీస్‌లో లిజెల్‌ లీ (83 నాటౌట్, 4, 132 నాటౌట్, 69) అద్భుత ప్రదర్శన చేసినందుకు

ఇద్దరు యూఏఈ క్రికెటర్లపై ఎనిమిదేళ్ల నిషేధం
మ్యాచ్‌ ఫిక్సర్లపై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి కొరడా ఝుళిపించింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) మాజీ కెప్టెన్‌ మొహమ్మద్‌ నవీద్, అతని సహచరుడు షైమన్‌ అన్వర్‌లపై ఎనిమిదేళ్ల నిషేధం విధించింది. వీరిద్దరు 2019లో జరిగిన టి20 ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలింది. ఆరోపణలు రావడంతో అదే ఏడాది ఇద్దరినీ తాత్కాలికంగా సస్పెండ్‌ చేసిన ఐసీసీ... తదుపరి అవినీతి నిరోధక శాఖ విచారణ అనంతరం తుది నిర్ణయం వెలువరిచింది. ఫిక్సింగ్‌కు పాల్పడిన వీరిద్దరు విచారణకు కూడా సహకరించకపోవడంతో ఐసీసీ ఈ చర్య తీసుకుంది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఇద్దరు యూఏఈ క్రికెటర్లపై ఎనిమిదేళ్ల నిషేధం
ఎవరు : మొహమ్మద్‌ నవీద్, షైమన్‌ అన్వర్‌
ఎక్కడ : దుబాయ్‌
ఎందుకు : మ్యాచ్‌ ఫిక్సర్ల ఆరోపణలు రావడంతో..

కబడ్డీ చాంపియన్‌షిప్‌ పోటీలకు ఆతిథ్యమివ్వనున్న రాష్ట్రం?
జాతీయ జూనియర్‌ కబడ్డీ చాంపియన్‌షిప్‌ పోటీలకు తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యమివ్వనుంది. 2021, మార్చి 22 నుంచి 25 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్‌కు సూర్యాపేట జిల్లాలోని ఎస్పీ ఆఫీసు గ్రౌండ్‌ నిలువనుంది. గుంటకండ్ల సావిత్రమ్మ స్మారకార్థం నిర్వహిస్తున్న ఈ టోర్నీలో మొత్తం 29 రాష్ట్రాల జట్ల నుంచి 1,500 మంది క్రీడాకారులు పాల్గొంటారు. నాలుగు రోజులపాటు ఈ టోర్నిల జరగనుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర క్రీడల మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌గా అల్లిపురం వెంకటేశ్వర్‌ రెడ్డి ఉన్నారు.

సారా టేలర్‌ ఏ దేశానికి చెందిన క్రికెటర్‌?
ఇంగ్లండ్‌ మహిళల జట్టు మాజీ వికెట్‌ కీపర్‌ సారా టేలర్‌(ఇంగ్లండ్‌)కు అరుదైన అవకాశం దక్కింది ఇంగ్లండ్‌ దేశవాళీ చాంపియన్‌షిప్‌ కౌంటీ క్రికెట్‌లోని ససెక్స్‌ పురుషుల జట్టుకు ఆమె వికెట్‌ కీపింగ్‌ కోచ్‌గా ఎంపికైంది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : జాతీయ జూనియర్‌ కబడ్డీ చాంపియన్‌షిప్‌ పోటీలకు ఆతిథ్యమివ్వనున్న రాష్ట్రం?
ఎప్పుడు : 2021, మార్చి 22 నుంచి 25 వరకు
ఎవరు : తెలంగాణ రాష్ట్రం
ఎక్కడ : సూర్యాపేట, తెలంగాణ

ఇండియన్‌ అథ్లెటిక్స్‌ మీట్‌లో సరికొత్త రికార్డు
Current Affairs
ఇండియన్‌ గ్రాండ్‌ప్రి అథ్లెటిక్స్‌ మీట్‌లో భారత స్టార్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా జావెలిన్‌ త్రోలో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు. పంజాబ్‌లోని పాటియాలాలో మార్చి 5న జరిగిన ఈవెంట్‌లో ఈటెను నీరజ్‌ చోప్రా 88.07 మీటర్ల దూరం విసిరి కొత్త జాతీయ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో 88.06 మీటర్లతో (2018 ఆసియా క్రీడల్లో) తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును నీరజ్‌ చోప్రా సవరించాడు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : జావెలిన్‌ త్రోలో కొత్త జాతీయ రికార్డు
ఎప్పుడు : మార్చి 5
ఎవరు : భారత స్టార్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా
ఎక్కడ : పాటియాలా, పంజాబ్‌

వరల్డ్‌ ర్యాంకింగ్‌ సిరీస్‌లో స్వర్ణం నెగ్గిన భారత రెజ్లర్‌?

వరల్డ్‌ ర్యాంకింగ్‌ సిరీస్‌ (డబ్ల్యూఆర్‌ఎస్‌) రెజ్లింగ్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పూనియా స్వర్ణ పతకాన్ని గెలిచాడు. మార్చి 7న ఇటలీలోని రోమ్‌ నగరంలో జరిగిన పురుషుల 65 కేజీల విభాగం ఫైనల్లో బజరంగ్‌ మంగోలియా రెజ్లర్‌ తుల్గా తుమర్‌పై విజయం సాధించాడు. మరోవైపు భారత్‌కే చెందిన విశాల్‌ (70 కేజీలు) కాంస్యం సాధించాడు.
53 కేజీల విభాగంలో వినేశ్‌...
డబ్ల్యూఆర్‌ఎస్‌ టోర్నిలో భారత మహిళా స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ విజేతగా అవతరించింది. రోమ్‌లో మార్చి 6న మహిళల ఫ్రీస్టయిల్‌ 53 కేజీల విభాగం ఫైనల్లో వినేశ్‌ 4–0తో డయానా మేరీ హెలెన్‌ వెకర్‌ (కెనడా)ను ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది.
ఇటలీ రాజధాని: రోమ్‌; కరెన్సీ: యూరో
ఇటలీ ప్రస్తుత అధ్యక్షుడు: సెర్గియో మాటారెల్లా
ఇటలీ ప్రస్తుత ప్రధానమంత్రి: మారియో ద్రాగి
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : డబ్ల్యూఆర్‌ఎస్‌ రెజ్లింగ్‌ టోర్నమెంట్‌లో స్వర్ణ పతకం గెలుపు
ఎప్పుడు : మార్చి 7
ఎవరు : బజరంగ్‌ పూనియా
ఎక్కడ : రోమ్, ఇటలీ

ఐటీఎఫ్‌ పురుషుల టోర్నీలో డబుల్స్‌ టైటిల్‌ నెగ్గిన భారత జోడీ?
అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) పురుషుల టోర్నీ డబుల్స్‌ విభాగంలో సాకేత్‌ మైనేని, యూకీ బాంబ్రీ ద్వయం విజేతగా నిలిచింది. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో మార్చి 6న జరిగిన ఫైనల్లో సాకేత్‌–యూకీ బాంబ్రీ జంట 6–2, 6–3తో కాజా వినాయక్‌ శర్మ–విజయ్‌ సుందర్‌ ప్రశాంత్‌ (భారత్‌) జోడీపై గెలిచింది. ఆంధ్రప్రదేశ్‌ టెన్నిస్‌ ప్లేయర్, భారత డేవిస్‌ కప్‌ జట్టు సభ్యుడు అయిన సాకేత్‌ మైనేని కెరీర్‌లో ఓవరాల్‌గా ఇది 21వ డబుల్స్‌ టైటిల్‌.
రన్నరప్‌ సౌజన్య జోడీ...
న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నమెంట్‌లో సౌజన్య–ప్రార్థన తొంబారే (భారత్‌) జోడీ రన్నరప్‌గా నిలిచింది. మార్చి 6న జరిగిన డబుల్స్‌ ఫైనల్లో సౌజన్య–ప్రార్థన ద్వయం 2–6, 3–6తో పియా లవ్రిచ్‌ (స్లొవేనియా)–అడ్రియన్‌ నాగీ (హంగేరి) జంట చేతిలో పరాజయం పాలైంది.
ఉత్తరప్రదేశ్‌...
రాజధాని: లక్నో
ప్రస్తుత గవర్నర్‌: ఆనందీబెన్‌ పటేల్‌
ప్రస్తుత ముఖ్యమంత్రి: యోగి ఆదిత్యనాథ్‌
హైకోర్టు: అలహాబాద్‌. హైకోర్టు బెంచ్‌ లక్నోలో ఉంది.
లోక్‌సభ స్థానాలు: 80
రాజ్యసభ స్థానాలు: 31
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) పురుషుల టోర్నీ డబుల్స్‌ విభాగంలో టైటిల్‌ గెలుపు
ఎప్పుడు : మార్చి 6
ఎవరు : సాకేత్‌ మైనేని, యూకీ బాంబ్రీ ద్వయం
ఎక్కడ : లక్నో, ఉత్తరప్రదేశ్‌

ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డుకు ఎంపికైన క్రికెటర్‌?
అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) 2021 ఏడాది ప్రవేశపెట్టిన ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’ అవార్డు వరుసగా రెండో నెల కూడా భారత ఆటగాడినే వరించింది. మొదటి నెల(జనవరి) అవార్డును రిషభ్‌ పంత్‌ అందుకున్నాడు. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన (176 పరుగులు; 24 వికెట్లు) కనబరిచిన రవిచంద్రన్‌ అశ్విన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ ఫర్‌ ఫిబ్రవరి’ అవార్డుకు ఎంపికయ్యాడు.
జొకోవిచ్‌ ‘టాప్‌’ రికార్డు
పురుషుల టెన్నిస్‌ సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌ చరిత్రలో అత్యధిక వారాలపాటు నంబర్‌వన్‌ ర్యాంక్‌లో నిలిచిన ప్లేయర్‌గా ప్రస్తుత టాప్‌ ర్యాంకర్, సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ రికార్డు సృష్టించాడు. మార్చి 8న విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో జొకోవిచ్‌ 12, 030 పాయింట్లతో ‘టాప్‌’ ర్యాంక్‌ను నిలబెట్టు కున్నాడు. 311 వారాలపాటు ఈ స్థానంలో నిలవడం ద్వారా 310 వారాలతో ఇప్పటివరకు రోజర్‌ ఫెడరర్‌(స్విట్జర్లాండ్‌) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును జొకోవిచ్‌ బద్దలు కొట్టాడు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు ఎంపిక
ఎప్పుడు : మార్చి 9
ఎవరు : రవిచంద్రన్‌ అశ్విన్‌
ఎందుకు : క్రికెట్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరిచినందుకు

న్యూఢిల్లీ మారథాన్‌ రేసులో విజేతగా నిలిచిన అథ్లెట్‌?

విజయనగరం జిల్లాకు చెందిన అథ్లెట్‌ శ్రీను బుగథ న్యూఢిల్లీ మారథాన్‌ రేసులో విజేతగా నిలిచాడు. మార్చి 7న జరిగిన జరిగిన ఈ రేసులో ఆర్మీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ (ఏఎస్‌ఐ–పుణే)కు ప్రాతినిధ్యం వహిస్తున్న 27 ఏళ్ల శ్రీను... నిర్ణీత 42.195 కిలోమీటర్ల లక్ష్యాన్ని అందరికంటే వేగంగా 2 గంటల 14 నిమిషాల 59 సెకన్లలో అందుకొని స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. శ్రీను 2010లో ఇండియన్‌ ఆర్మీలో చేరాడు.

జన్‌జాతీయ సమ్మేళన్‌లో కోవింద్‌...
సాధారణ ప్రజల్లో కంటే ఆదివాసీల్లో లింగ నిష్పత్తి రేటు మెరుగ్గా ఉందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని దామోలో మార్చి 7న జరిగిన ఆదివాసీల సదస్సు ‘జన్‌జాతీయ సమ్మేళన్‌ ’కు కోవింద్‌ హాజరయ్యారు.

కంబైన్డ్‌ కమాండర్ల సదస్సులో మోదీ...

గుజరాత్‌లోని నర్మదా జిల్లా కెవాడియాలో మార్చి 6న భారత రక్షణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కంబైన్డ్‌ కమాండర్ల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. కొత్తకొత్త సవాళ్లకు ధీటుగా బదులివ్వడానికి భారత సైన్యం ‘భవిష్యత్‌ శక్తి’గా అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు.

డీఎస్పీగా నియమితులైన భారత స్టార్‌ అథ్లెట్‌?
Current Affairs
భారత స్టార్‌ అథ్లెట్‌ హిమా దాస్‌ను అస్సాం ప్రభుత్వం ఉన్నతోద్యోగంతో గౌరవించింది. ఆమెను డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీఎస్పీ) పదవిలో నియమించింది. ఈ మేరకు ఫిబ్రవరి 26న జరిగిన ఒక కార్యక్రమంలో 21 ఏళ్ల హిమా దాస్‌కు అస్సాం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్‌ నియామక పత్రాలు అందజేశారు. 2018లో ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో హిమా 400 మీటర్ల విభాగంలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. అదే ఏడాది ఆసియా క్రీడల్లో స్వర్ణం, రజతం సాధించింది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : డీఎస్పీగా నియమితులైన భారత స్టార్‌ అథ్లెట్‌?
ఎప్పుడు : ఫిబ్రవరి 26
ఎవరు : హిమా దాస్‌
ఎక్కడ : అస్సాం
ఎందుకు : క్రీడల్లో విశేష ప్రతిభకనబరిచినందుకు

క్రికెట్‌ వీడ్కోలు పలికిన యూసుఫ్, వినయ్‌
భారత క్రికెట్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఆపై దేశవాళీ క్రికెట్‌లోనూ తమదైన ముద్ర వేసిన ఇద్దరు క్రికెటర్లు ఫిబ్రవరి 26న ఆటకు వీడ్కోలు పలికారు. 38 ఏళ్ల గుజరాత్‌ ఆల్‌రౌండర్‌ యూసుఫ్‌ పఠాన్‌ తన రిటైర్మెంట్‌ను ప్రకటించగా... 37 ఏళ్ల కర్ణాటక పేస్‌ బౌలర్‌ వినయ్‌ కుమార్‌ కూడా వీడ్కోలు పలికాడు.
యూసుఫ్‌ పఠాన్‌...
1982, నవంబర్‌ 17న గుజరాత్‌లోని వడోదరలో జన్మించిన యూసుఫ్‌... 2007 టి20 ప్రపంచ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ (పాకిస్తాన్‌పై)తో అరంగేట్రం చేశాడు. మొత్తం 22 టి20 మ్యాచ్‌లు ఆడిన యూసుఫ్‌ 236 పరుగులు చేయడంతో పాటు తన ఆఫ్‌ స్పిన్‌తో 13 వికెట్లు పడగొట్టాడు. 57 వన్డేల్లో 113.60 స్ట్రయిక్‌రేట్‌తో 810 పరుగులు సాధించాడు. 2011లో ధోని సారథ్యంలో వన్డే వరల్డ్‌కప్‌లో చాంపియన్‌గా నిలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఐపీఎల్‌లో తనదైన ప్రదర్శనతో గుర్తింపు పొందాడు.
వినయ్‌ కుమార్‌...
1984, ఫిబ్రవరి 12న కర్ణాటకలోని దావణగెరెలో వినయ్‌ జన్మించాడు. ఈ పేస్‌ బౌలర్‌ 139 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లలో ఏకంగా 504 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రంజీ ట్రోఫీలో సాధించినవే 442 (115 మ్యాచ్‌లు) ఉన్నాయి. అత్యధిక రంజీ వికెట్లు సాధించిన జాబితాలో రాజీందర్‌ గోయల్‌ (637), వెంకట్రాఘవన్‌ (530), సునీల్‌ జోషి (479) తర్వాత నాలుగో స్థానంలో వినయ్‌ ఉండగా... పేస్‌ బౌలర్లలో అతనిదే అగ్రస్థానం. కర్ణాటకతో పాటు పుదుచ్చేరి తరఫున కూడా ఆడాడు. ఐపీఎల్‌లోనూ తన ప్రతిభను చాటాడు. భారత్‌ తరపున ఒకే ఒక టెస్టు ఆడి 1 వికెట్‌ తీసిన అతను... 31 వన్డేల్లో 38 వికెట్లు, 9 టి20ల్లో 10 వికెట్లు పడగొట్టాడు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : క్రికెట్‌ వీడ్కోలు పలికిన ఆటగాళ్లు?
ఎప్పుడు : ఫిబ్రవరి 26
ఎవరు : యూసుఫ్‌ పఠాన్, వినయ్‌ కుమార్‌

ఉక్రెనియన్‌ రెజ్లింగ్‌ టోర్నీలో స్వర్ణం గెలిచిన భారత క్రీడాకారిణి?
అవుట్‌స్టాండింగ్‌ ఉక్రెనియన్‌ రెజ్లర్స్‌ అండ్‌ కోచెస్‌ స్మారక అంతర్జాతీయ రెజ్లింగ్‌ టోర్నమెంట్‌లో... భారత మహిళా స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ స్వర్ణ పతకం సాధించింది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో ఫిబ్రవరి 28న జరిగిన 53 కేజీల విభాగం ఫైనల్లో వినేశ్‌... ప్రస్తుతం యూరోపియన్‌ చాంపియన్, 2017 వరల్డ్‌ చాంపియన్‌ వానెస్సా కలాద్‌జిన్‌స్కాయ్‌ (బెలారస్‌)ను ‘బై ఫాల్‌’ పద్ధతిలో ఓడించి చాంపియన్‌గా అవతరించింది.
అడిలైడ్‌ ఓపెన్‌ విజేత స్వియాటెక్‌...
పోలాండ్‌ టీనేజ్‌ టెన్నిస్‌ స్టార్, ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ చాంపియన్‌ ఇగా స్వియాటెక్‌ కెరీర్‌లో రెండో టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 27న ముగిసిన అడిలైడ్‌ ఓపెన్‌లో 19 ఏళ్ల స్వియాటెక్‌ విజేతగా నిలిచింది. ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్‌ స్వియాటెక్‌ 6–2, 6–2తో 12వ ర్యాంకర్‌ బెలిండా బెన్సిచ్‌ (స్విట్జర్లాండ్‌)పై గెలిచింది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : అవుట్‌స్టాండింగ్‌ ఉక్రెనియన్‌ రెజ్లర్స్‌ అండ్‌ కోచెస్‌ స్మారక అంతర్జాతీయ రెజ్లింగ్‌ టోర్నిలో స్వర్ణం గెలిచిన భారత క్రీడాకారిణి?
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : భారత మహిళా స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌
ఎక్కడ : కీవ్, ఉక్రెయిన్‌

ఇన్‌స్టాలో 10 కోట్ల ఫాలోవర్లను సంపాదించుకున్న తొలి సెలబ్రిటి?
భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి ఖాతాలో మరో రికార్డు చేరింది. సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లిని ఫాలో అవుతున్న వారి సంఖ్య మార్చి 1న 10 కోట్లు దాటింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి ఆసియా సెలబ్రిటిగా, తొలి క్రికెటర్‌గా కోహ్లి గుర్తింపు పొందాడు. ప్రపంచ వ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన క్రీడాకారుల జాబితాలో ఫుట్‌బాల్‌ స్టార్స్‌ రొనాల్డో (26.60 కోట్లు), మెస్సీ (18.70 కోట్లు), నెమార్‌ (14.70 కోట్లు) తర్వాత కోహ్లి నాలుగో స్థానంలో ఉన్నాడు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఇన్‌స్టాలో 10 కోట్ల ఫాలోవర్లను సంపాదించుకున్న తొలి సెలబ్రిటి?
ఎప్పుడు : మార్చి 1
ఎవరు : భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి
ఎక్కడ : ఆసియా ఖండం

ఏటీపీ–500 టోర్నీలో ఇండో–పాక్‌ ఎక్స్‌ప్రెస్‌ జోడీ
టెన్నిస్‌ సర్క్యూట్‌లో ‘ఇండో–పాక్‌ ఎక్స్‌ప్రెస్‌’గా గుర్తింపు పొందిన రోహన్‌ బోపన్న (భారత్‌), ఐజామ్‌ ఉల్‌ హఖ్‌ ఖురేషి (పాకిస్తాన్‌) మళ్లీ కలసి ఆడనున్నారు. 2021, మార్చి 15న మెక్సికోలో మొదలయ్యే అకాపుల్కో ఏటీపీ–500 టోర్నీలో బోపన్న–ఖురేషి ద్వయం తమ ఎంట్రీని ఖరారు చేసింది. దీంతో 2014లో షెన్‌జెన్‌ ఏటీపీ–250 టోర్నీ తర్వాత వీరిద్దరు మళ్లీ కలిసి ఆడనున్నారు. 2010లో బోపన్న–ఖురేషి జంట యూఎస్‌ ఓపెన్‌ డబుల్స్‌లో రన్నరప్‌గా నిలిచింది.
మెక్సికో రాజధాని: మెక్సికో సిటీ; కరెన్సీ: మెక్సికన్‌ పెసో
మెక్సికో ప్రస్తుత అధ్యక్షుడు: ఆండ్రెస్‌ మాన్యువల్‌ లోపెజ్‌ ఒబ్రాడోర్‌

ఆర్చరీలో జ్యోతి సురేఖ కొత్త జాతీయ రికార్డు
భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన సెలెక్షన్‌ ట్రయల్స్‌లో పెట్రోలియం స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ బోర్డు (పీఎస్‌పీబీ)కి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ కొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది. మహిళల కాంపౌండ్‌ విభాగం ర్యాంకింగ్‌ రౌండ్‌లో జ్యోతి సురేఖ 720 పాయింట్లకుగాను 710 పాయింట్లు స్కోరు చేసింది. దీంతో 2020 ఏడాది 709 పాయింట్లతో తానే నెలకొల్పిన జాతీయ రికార్డును సురేఖ సవరించింది.
ఓవరాల్‌ ర్యాంకింగ్‌ రౌండ్‌లలో మొత్తం 2,808 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచిన సురేఖ 2021, ఏప్రిల్‌ నెలలో జరిగే ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టులో చోటు దక్కించుకుంది. సెలెక్షన్‌ ట్రయల్స్‌ను హరియాణా సోనెపట్‌లో నిర్వహిస్తున్నారు.
Published date : 14 Apr 2021 02:21PM

Photo Stories