Archery World Cup: వరల్డ్ కప్ ఆర్చరీ స్టేజ్–2లో సురేఖ జోడీకి స్వర్ణం
మిక్స్‌డ్ డబుల్స్‌లో ఆమె స్వర్ణపతకాన్ని సొంతం చేసుకుంది. సురేఖ– ఓజస్ ప్రవీణ్ దేవ్‌తలే జోడి ఫైనల్లో 156–155 స్కోరు తేడాతో కొరియా జంట కిమ్ జోంగో–ఓహ్‌యూహ్యూన్‌ను ఓడించింది. తొలి మూడు ఎండ్‌లలో ఇరు జట్లు సమంగా పోటీ పడుతూ వరుసగా 39, 39, 39 చొప్పున పాయింట్లు సాధించడంతో స్కోరు 117–117తో సమంగా నిలిచింది. చివరి ఎండ్‌లో భారత ద్వయం 39 పాయింట్లు నమోదు చేయగా...కొరియా 38కే పరిమితమైంది. దాంతో సురేఖ–ఓజస్‌లకు పసిడి దక్కింది. పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో భారత ఆర్చర్ ప్రథమేశ్ జౌకర్ సంచలనం సృష్టించాడు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (23-29 ఏప్రిల్ 2023)
ఫైనల్లో ప్రథమేశ్ 149–148తో నెదర్లాండ్స్‌కు చెందిన వరల్డ్ నంబర్‌వన్ మైక్ స్కోసర్‌పై విజయం సాధించాడు. 19 ఏళ్ల ప్రథమేశ్ కెరీర్‌లో ఇది రెండో అంతర్జాతీయ టోర్నీ మాత్రమే. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత్‌కు చెందిన అవనీత్ కౌర్ కాంస్యం గెలుచుకుంది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో అవనీత్ 147–144తో ఐపెక్ తోమ్రుక్ (తుర్కియే)ను ఓడించింది.
ISSF World Cup Baku 2023: రిథమ్ ప్రపంచ రికార్డు.. అయినా పతకానికి దూరం