Rest of India: ఇరానీ కప్ చాంపియన్ రెస్ట్ ఆఫ్ ఇండియా
Sakshi Education
రాజ్‌కోట్: ఇరానీ కప్ మళ్లీ రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టునే వరించింది.
రంజీ మాజీ చాంపియన్ సౌరాష్ట్రతో జరిగిన పోరులో రెస్ట్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. అక్టోబర్ 4న 368/8 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సౌరాష్ట్ర కేవలం మరో 12 పరుగులే జత చేసి మిగిలున్న రెండు వికెట్లను కోల్పోయింది. 380 పరుగుల వద్ద ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 276 పరుగుల ఆధిక్యం పొందిన రెస్ట్ ఆఫ్ ఇండియా ముందు 105 పరుగుల లక్ష్యమే ఉండగా... దీన్ని 31.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ ప్రియాంక్ (2), యశ్ ధుల్ (8) విఫలమవగా, అభిమన్యు ఈశ్వరన్ (63 నాటౌట్; 9 ఫోర్లు), శ్రీకర్ భరత్ (27 నాటౌట్; 5 ఫోర్లు) మరో వికెట్ పడకుండా మ్యాచ్ ముగించారు. ఇద్దరు అబేధ్యమైన మూడో వికెట్‌కు 81 పరుగులు జోడించారు. దీంతో రెస్ట్ ఆఫ్ ఇండియా ఖాతాలో 29వసారి ఇరానీ కప్ చేరింది.
Also read: Nationa Games 2022 : ఏపీ, తెలంగాణకు పతకాలు
Published date : 06 Oct 2022 06:34PM