Skip to main content

Batch Open Squash: బ్యాచ్‌ ఓపెన్‌ స్క్వాష్‌ టోర్నీ విజేత వెలవన్

భారత స్క్వాష్‌ ప్లేయర్‌ వెలవన్‌ సెంథిల్‌ కుమార్‌ తన కెరీర్‌లో ఎనిమిదో ప్రొఫెషనల్‌ స్క్వాష్‌ అసోసియేషన్‌ (పీఎస్‌ఏ) టైటిల్‌ను సాధించాడు.
India's Velavan Senthilkumar Wins Batch Open Squash

పారిస్‌లో జరిగిన బ్యాచ్‌ ఓపెన్‌ చాలెంజర్‌ టోర్నీలో తమిళనాడుకు చెందిన 26 ఏళ్ల వెలవన్‌ విజేతగా నిలిచాడు.

ఫైనల్లో ప్రపంచ 58వ ర్యాంకర్‌ వెలవన్‌ 11–6, 11–9, 11–6తో మెల్విల్‌ సియానిమానికో (ఫ్రాన్స్‌)పై గెలుపొంది ఈ ఏడాది తన ఖాతాలో తొలి టైటిల్‌ను జమ చేసుకున్నాడు. ఈ సంవత్సరం నాలుగు టోర్నీలలో పాల్గొన్న వెలవన్‌ రెండింటిలో క్వార్టర్‌ ఫైనల్‌ చేరి, మరో రెండింటిలో రెండో రౌండ్‌లో ఓడిపోయాడు. 

Archery World Cup: ప్రపంచకప్ టోర్నీలో సత్తా చాటిన భారత ఆర్చరీ జట్టు!

Published date : 30 Apr 2024 01:20PM

Photo Stories