Skip to main content

Indian Super League (ISL): హైదరాబాద్‌ FC ఘనవిజయం

ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ హైదరాబాద్‌ ఎఫ్‌సీ తొలి విజయాన్ని అందుకుంది.
Indian Super League (ISL)
Indian Super League (ISL)

అక్టోబర్ 13న నార్త్‌ ఈస్ట్‌ యునైటెడ్‌ ఎఫ్‌సీతో జరిగిన పోరులో  హైదరాబాద్‌ 3–0తో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ జోరు ముందు నార్త్‌ఈస్ట్‌ జట్టు తేలిపోయింది. మ్యాచ్‌ ఆరంభమైన 13వ నిమిషంలోనే బార్తొలొమి ఒబెచ్‌ గోల్‌ చేయడంతో 1–0తో హైదరాబాద్‌ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై క్రమం తప్పకుండా దాడులకు పదునుపెట్టిన డిఫెండింగ్‌ చాంపియన్‌ రెండో అర్ధభాగంలో మరో రెండు గోల్స్‌ చేసింది. హలిచరన్‌ నర్జరీ (69వ ని.), బొర్జ హెరెరా (73వ ని.) నాలుగు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్‌ చేయడంతో హైదరాబాద్‌ విజయం ఖాయమైంది.   

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 14 Oct 2022 06:21PM

Photo Stories