World Cup Snooker Tournament: 6 రెడ్స్ స్నూకర్ టోర్నీలో విజేతగా నిలిచిన భారతీయుడు?
6 రెడ్స్ వరల్డ్‌కప్ స్నూకర్ టోర్నీలో భారత స్టార్ స్నూకర్ పంకజ్ అద్వానీ విజేతగా నిలిచాడు. ఖతార్ రాజధాని దోహాలో సెప్టెంబర్ 21న ముగిసిన ఈ టోర్నీ ఫైనల్లో పంకజ్ 7–5 ఫ్రేమ్‌ల తేడాతో బాబర్ మసీ (పాకిస్తాన్) పై నెగ్గాడు. పంకజ్‌కు 12 వేల డాలర్ల (రూ. 8 లక్షల 84 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. ఇటీవల జరిగిన ఆసియా స్నూకర్ టోర్నీలోనూ పంకజ్ విజేతగా అవతరించిన విషయం తెలిసిందే.
హుసాముద్దీన్‌కు రజతం...
జాతీయ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ (57 కేజీలు) రజతం సాధించాడు. సర్వీసెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హుసాముద్దీన్ ఫైనల్లో 0–5తో రోహిత్ మోర్ (ఢిల్లీ) చేతిలో ఓడిపోయాడు. దాంతో విజేతగా నిలిచిన రోహిత్ మోర్ సెర్బియా వేదికగా అక్టోబర్ 24 నుంచి నవంబర్ 6 వరకు జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు తరఫున బరిలోకి దిగుతాడు.
చదవండి: రాష్ట్రం నుంచి జీఎం హోదా పొందిన మూడో ప్లేయర్?
క్విక్ రివ్యూ :
ఏమిటి : 6 రెడ్స్ వరల్డ్‌కప్ స్నూకర్ టోర్నీలో విజేతగా నిలిచిన భారతీయుడు?
ఎప్పుడు : సెప్టెంబర్ 21
ఎవరు : భారత స్టార్ స్నూకర్ పంకజ్ అద్వానీ
ఎక్కడ : దోహా, ఖతార్
ఎందుకు : ఫైనల్లో పంకజ్ 7–5 ఫ్రేమ్‌ల తేడాతో బాబర్ మసీ (పాకిస్తాన్) పై విజయం సాధించినందున...