Women's T20 శ్రీలంకతో T20 సీరీస్ నెగ్గిన భారత మహిళల జట్టు
Sakshi Education
శ్రీలంక వేదికగా ఆ జట్టుతో జరిగిన మహిళల టీ20 సీరీస్ ను భారత 2 - 1 తేడాతో కైవసం చేసుకుంది. మొదటి రెండు టీ20 లో విజయం సాధింటిన టీమిండియా, ఆఖరి మ్యాచ్ లో ఓడిపోయి 2–1తో సీరీస్ గెలుచుకుంది. ఎనిమిదేళ్ల తర్వాత టి20 మ్యాచ్‌లో భారత జట్టుపై శ్రీలంక గెలిచింది. చివరిసారి ఆ జట్టు 2014లో భారత్‌ను ఓ టి20 మ్యాచ్‌లో ఓడించింది. అంతేకాకుండా స్వదేశంలో భారత్‌పై శ్రీలంకకిదే తొలి విజయం కావడం విశేషం.
Also read: GK Sports Quiz: 4వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఏ రాష్ట్రంలో జరగనున్నాయి?
శ్రీలంక పురుషులు, మహిళలకు సంబంధించిన టి20 చరిత్రలో 2000 పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి క్రికెటర్ గా చమరి ఆటపట్టు రికార్డు సృష్టించింది. మాజీ క్రికెటర్ తిలకరత్నే దిల్షాన్ (1889; అత్యధిక టి20 స్కోరర్)ను ఆమె ఎప్పుడో దాటేసింది.
Published date : 28 Jun 2022 06:23PM