Women's cricket: ఇంగ్లండ్‌పై నెగ్గిన భారత్
Sakshi Education
ఇంగ్లండ్ జట్టుతో సెప్టెంబర్ 24న జరిగిన చివరిదైన మూడో వన్డేలో హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని టీమిండియా 16 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. ఈ విజయంతో భారత్ సిరీస్‌ను 3–0తో నెగ్గింది.
మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 45.4 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 43.3 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. ఇంగ్లండ్ చివరి వికెట్ వివాదాస్పదమైంది. దీప్తి శర్మ బంతి వేయకముందే నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ చార్లీ డీన్ (47; 5 ఫోర్లు) క్రీజు దాటి ముందుకు వెళ్లింది. యాక్షన్ పూర్తి చేసిన దీప్తి వెంటనే వికెట్లను గిరాటేసింది. దాంతో చార్లీ డీన్‌ను రనౌట్‌గా ప్రకటించడంతో భారత విజయం ఖరారైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రేణుక సింగ్ (4/29). హర్మన్‌ప్రీత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది.
Also read: Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 24th కరెంట్ అఫైర్స్
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 26 Sep 2022 07:19PM