Skip to main content

Chengdu Korea: భారత పురుషుల స్క్వాష్‌ జట్టు ఆసియాలో తొలిసారి స్వర్ణం సాధించింది

చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు స్వర్ణం సాధించింది. నవంబర్ 4న జరిగిన ఫైనల్లో భారత్‌ 2–0 తేడాతో    కువైట్‌పై విజయం సాధించింది. ఈ టోర్నీలో భారత్‌ విజేతగా నిలవడం ఇదే తొలిసారి.
India men's squash team wins maiden gold
India men's squash team wins maiden gold

తొలి మ్యాచ్‌లో రమీత్‌ టాండన్‌ 11–5, 11–7, 11–4తో అలీ అరామెజిపై గెలుపొందగా, రెండో మ్యాచ్‌లో భారత స్టార్‌ సౌరవ్‌ ఘోషాల్‌ 11–9, 11–2, 11–3తో అమ్మార్‌ అల్టమిమిని చిత్తు చేశాడు. ఫలితం తేలడంతో అభయ్‌ సింగ్, ఫలా మొహమ్మద్‌ మధ్య జరగాల్సిన చివరి మ్యాచ్‌ను నిర్వహించలేదు. గతంలో ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత్‌ రెండు సార్లు రన్నరప్‌గానే నిలిచింది. సెమీఫైనల్లో మలేసియా చేతిలో 1–2తో ఓడిన భారత మహిళల జట్టుకు కాంస్యం లభించింది.   

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 05 Nov 2022 01:16PM

Photo Stories