Skip to main content

Hockey Pro League 2022-23:‘షూటౌట్‌’లో స్పెయిన్‌పై భారత్‌ విజయం

భువనేశ్వర్‌: ప్రొ హాకీ లీగ్‌ 2022–2023 సీజన్‌లో భారత జట్టు మూడో విజయం నమోదు చేసింది. స్పెయిన్‌ జట్టుతో నవంబర్ 6న జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ‘షూటౌట్‌’లో 3–1తో గెలిచింది. నిర్ణిత సమయం ముగిసేసరికి రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి.
India beat Spain 3-2 via shootout
India beat Spain 3-2 via shootout

భారత్‌ తరఫున కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ రెండు గోల్స్‌ (12వ, 32వ ని.లో) సాధించగా... స్పెయిన్‌ జట్టుకు మిరాలెస్‌ (43వ ని.లో), అమత్‌ పెరె (55వ ని.లో) ఒక్కో గోల్‌ చేశారు. ‘షూటౌట్‌’లో భారత్‌ తరఫున హర్మన్‌ప్రీత్, రాజ్‌కుమార్‌ పాల్, అభిషేక్‌... స్పెయిన్‌ తరఫున గెరార్డ్‌ క్లాప్స్‌ సఫలమయ్యారు. స్పెయిన్‌ ప్లేయర్లు మెనిని, వియోలోంగా, మిరాలెస్‌ షాట్‌లను భారత గోల్‌కీపర్‌ కృషన్‌ బహదూర్‌ పాఠక్‌ నిలువరించాడు. తొమ్మిది జట్లు పాల్గొంటున్న ఈ లీగ్‌లో భారత్‌ ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.   

Also read: Chengdu Korea: భారత పురుషుల స్క్వాష్‌ జట్టు ఆసియాలో తొలిసారి స్వర్ణం సాధించింది

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 07 Nov 2022 02:02PM

Photo Stories