Skip to main content

Team India Top 1 Rank : వన్డే, టి20ల్లో టాప్‌-1 మనమే.. ఇక టెస్టులో కూడా..

టీమిండియా సూపర్‌ ఫామ్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. స్వదేశంలో ఎప్పటికి మనం పులులమే అని మరోసారి కివీస్‌తో సిరీస్‌ రుజువు చేసింది. వరుసగా రెండు వన్డే సిరీస్‌లు క్లీన్‌స్వీప్‌ చేయడం అంటే ఏ జట్టుకైనా కష్టసాధ్యమే. కానీ టీమిండియా మొదట శ్రీలంకను.. తాజాగా న్యూజిలాండ్‌ను అవలీలగా క్లీన్‌స్వీప్‌ చేసి పారేసింది.
team india ranking in odi test and t20
Team India Ranking in Odi test and T20

ప్రస్తుతం టి20ల్లో, వన్డేల్లో టీమిండియా నెంబర్‌వన్‌గా ఉంది.. ఇక టెస్టుల్లోనూ అగ్రస్థానం అందుకుంటే.. ముచ్చటగా మూడు ఫార్మాట్లలోనూ ఏకకాలంలో నెంబర్‌వన్‌గా నిలిచిన అరుదైన జట్టుగా నిలవనుంది. బహుశా ఇంతకముందెన్నడూ మూడు ఫార్మాట్లలో ఒకే జట్టు నెంబర్‌వన్‌గా లేదన్నది సమాచారం.

☛ Cricket: వన్డేల్లో నంబర్‌ వన్‌ బౌలర్‌ మనోడే... హైదరాబాద్‌ కా షాన్‌ మహ్మద్‌ సిరాజ్‌

ఈ టెస్టు సిరీస్‌లో టీమిండియా గెలిస్తే ..నెంబర్‌వన్‌ ర్యాంక్‌లో..

team india rank 2023

వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో మొదలుకానున్న నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను టీమిండియా గెలిస్తే గనుక టెస్టుల్లో నెంబర్‌వన్‌ ర్యాంకును పొందుతుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా.. టీమిండియా రెండో స్థానంలో ఉంది. సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయకపోయినా.. 2-1 తేడాతో నెగ్గినా టీమిండియా అగ్రస్థానంలో నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ ప్రస్తతం ప్రపంచనెంబర్‌వన్‌గా ఉన్న ఆస్ట్రేలియాను ఓడించడం టీమిండియాకు సవాలే. కానీ టెస్టు సిరీస్‌ మన దగ్గర జరగడం సానుకూలాంశమనే చెప్పొచ్చు. ఈసారి కూడా టీమిండియా ఆస్ట్రేలియాపై ఆధిపత్యం ప్రదర్శించి టెస్టు సిరీస్‌ గెలవడంతో పాటు నెంబర్‌వన్‌ స్థానాన్ని అందుకుంటుందేమో చూడాలి. నెంబర్‌వన్‌ కావడంతో పాటు పనిలో పనిగా ఆస్ట్రేలియాతో ఐసీసీ వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఆడే అవకాశం కూడా టీమిండియాకు రానుంది.

☛ ICC Mens T20 Cricketer of the Year 2022 : ఐసీసీ టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా..

Published date : 25 Jan 2023 07:15PM

Photo Stories