Skip to main content

Hrishikesh Kanitkar: మహిళల టి20 జట్టు బ్యాటింగ్‌ కోచ్‌గా హృషికేశ్‌ కనిత్కర్

ఇంకో రెండు నెలల్లోనే దక్షిణాఫ్రికాలో మహిళల టి20 ప్రపంచకప్‌ జరగనుంది. ఇలాంటి తరుణంలో భారత మహిళల జట్టు హెడ్‌ కోచ్‌ రమేశ్‌ పొవార్‌ను జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)కి బదిలీ చేస్తూ బోర్డు తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యపరుస్తోంది.

అంతేకాదు.. ఇంకెవరినీ హెడ్‌ కోచ్‌గా నియమించలేదు. భారత మాజీ క్రికెటర్‌ హృషికేశ్‌ కనిత్కర్‌ను మాత్రం బ్యాటింగ్‌ కోచ్‌గా నియమించింది. ‘బెంగళూరులోని ఎన్‌సీఏకు పొవార్‌ను బదిలీ చేశాం. అకాడమీ డైరెక్టర్‌ లక్ష్మణ్‌ బృందంలో పురుషుల క్రికెట్‌ కోసం అతను పనిచేస్తాడు. బోర్డు పునర్నిర్మాణ ప్రణాళికల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని బీసీసీఐ తెలిపింది.  

Suryakumar Yadav: నంబర్‌వన్‌ బ్యాటర్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌

Published date : 07 Dec 2022 03:39PM

Photo Stories