Women's Grand Prix Chess Tournament: మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నీలో హారికకు నాలుగో స్థానం
Sakshi Education
భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నీలో నాలుగో స్థానం సంపాదించింది.
సైప్రస్‌లో మే 28న ముగిసిన ఈ టోర్నీలో నిర్ణీత 11 రౌండ్ల తర్వాత హారిక, పొలీనా షువలోవా (రష్యా), తాన్ జాంగి (చైనా) 6.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... షువలోవాకు రెండో ర్యాంక్, తాన్ జింగికి మూడో ర్యాంక్, హారికకు నాలుగో ర్యాంక్ ఖరారయ్యాయి. దినారా (జర్మనీ) 7 పాయింట్లతో విజేతగా నిలిచింది.
నిర్ణీత నాలుగు గ్రాండ్‌ప్రి సిరీస్ టోర్నీల తర్వాత టాప్–2లో నిలిచిన కాటరీనా లాగ్నో (రష్యా; 325 పాయింట్లు), అలెక్సాండ్రా గొర్యాచ్‌కినా (రష్యా; 318.5 పాయింట్లు) 2023–2024 క్యాండిడేట్ చెస్ టోర్నీకి అర్హత సాధించారు.
Published date : 29 May 2023 09:08AM