Retirement: అంతర్జాతీయ హాకీకి వీడ్కోలు పలికిన ఆటగాడు?
భారత స్టార్ ప్లేయర్ ఎస్‌వీ సునీల్(సౌమార్‌పేట్ విఠలాచార్య సునీల్) అంతర్జాతీయ హాకీ కెరీర్‌కు అక్టోబర్ 1న వీడ్కోలు పలికాడు. యువకులకు అవకాశమివ్వాలనే ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సునీల్ పేర్కొన్నాడు. కర్ణాటకకు చెందిన 32 ఏళ్ల సునీల్... తన 14 ఏళ్ల కెరీర్‌లో 264 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి 72 గోల్స్ చేశాడు. 2012, 2016 ఒలింపిక్స్‌లో ఆడిన సునీల్ టోక్యో గేమ్స్‌కు మాత్రం ఎంపిక కాలేదు. 2014 ఆసియా క్రీడల్లో పసిడి నెగ్గిన భారత టీమ్‌లో సునీల్ సభ్యుడిగా ఉన్నాడు.
శరత్ కమల్ ఏ క్రీడకు చెందినవాడు?
ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. ఖతార్ రాజధాని దోహాలో అక్టోబర్ 1న జరిగిన సెమీఫైనల్లో భారత్ 0–3తో దక్షిణ కొరియా చేతిలో ఓడింది. టోర్నీలో సెమీస్ చేరిన జట్లకు కనీసం కాంస్య పతకం దక్కుతుంది. భారత జట్టులో సత్యన్ జ్ఞానశేఖరన్, ఆచంట శరత్ కమల్, హర్మీత్ దేశాయ్ ఉన్నారు.
చదవండి: హాకీకి వీడ్కోలు పలికిన భారత స్టార్ ఆటగాళ్లు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతర్జాతీయ హాకీ కెరీర్‌కు వీడ్కోలు
ఎప్పుడు : అక్టోబర్ 1
ఎవరు : భారత స్టార్ ప్లేయర్ ఎస్‌వీ సునీల్(సౌమార్‌పేట్ విఠలాచార్య సునీల్)
ఎక్కడ : యువకులకు అవకాశమివ్వాలనే ఉద్దేశంతోనే...