Football: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ సాధించిన ప్లేయర్?
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డొ మరో కొత్త రికార్డును సృష్టించాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ సాధించిన ప్లేయర్‌గా రొనాల్డో అవతరించాడు. ప్రపంచకప్ క్వాలిఫయింగ్ పోటీల్లో భాగంగా ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ నగరంలో సెప్టెంబర్ 2న ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసిన రొనాల్డో 111 గోల్స్‌తో శిఖరాన నిలిచాడు. ఈ ఘనతను అతడు 180 మ్యాచ్‌ల్లో సాధించాడు. ఈ మ్యాచ్ ముందు వరకు 109 గోల్స్‌తో ఇరాన్ ప్లేయర్ అలీ దాయ్‌తో కలిసి అతను సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు.
ఫార్ములా వన్‌కు రైకొనెన్ గుడ్‌బై...
2007 ప్రపంచ డ్రైవర్ చాంపియన్, ఆల్ఫా రొమెయో డ్రైవర్ కిమీ రైకొనెన్ (ఫిన్లాండ్) తన 19 ఏళ్ల ఫార్ములా వన్ (ఎఫ్1) రేసింగ్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతోన్న ఎఫ్1 సీజనే తనకు చివరిదని అతడు సెప్టెంబర్ 2న ప్రకటించాడు. ఎఫ్1 చరిత్రలో అత్యధిక గ్రాండ్‌ప్రిల్లో (344) పాల్గొన్న రేసర్‌గా ఉన్నాడు. 21 గ్రాండ్‌ప్రిల్లో విజేతగా నిలిచాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ సాధించిన ప్లేయర్?
ఎప్పుడు : సెప్టెంబర్ 2
ఎవరు : క్రిస్టియానో రొనాల్డొ
ఎక్కడ : డబ్లిన్, ఐర్లాండ్
ఎందుకు : ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో చేసిన రెండు గోల్స్ సహా మొత్తం 111 గోల్స్ చేసినందున...