Max Verstappen: ఎఫ్1 సీజన్‌లో పదో విజయం సాధించిన వెర్‌స్టాపెన్
సొంతగడ్డపై సెప్టెంబర్ 4 న జరిగిన డచ్ గ్రాండ్‌ప్రి ప్రధాన రేసులో వెర్‌స్టాపెన్ విజేతగా నిలిచాడు. 72 ల్యాప్‌ల ఈ రేసును ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించిన వెర్‌స్టాపెన్ అందరికంటే వేగంగా గంటా 36 నిమిషాల 42.773 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. జార్జి రసెల్ (మెర్సిడెస్) రెండో స్థానంలో, చార్లెస్ లెక్‌లెర్క్ (ఫెరారీ) మూడో స్థానంలో నిలిచారు. ప్రపంచ మాజీ చాంపియన్ లూయిస్ హామిల్టన్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 22 రేసుల ఈ సీజన్‌లో ఇప్పటివరకు 15 రేసులు పూర్తయ్యాయి. వెర్‌స్టాపెన్ 319 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. తాజా గెలుపుతో వెర్‌స్టాపెన్ వరుసగా రెండో ఏడాదీ 10 విజయాలు సాధించాడు. ఒకే సీజన్‌లో అత్యధిక విజయాలు సాధించిన రికార్డు మైకేల్ షుమాకర్ (జర్మనీ; 2004లో 13), సెబాస్టియన్ వెటెల్ (జర్మనీ; 2013లో 13) పేరిట సంయుక్తంగా ఉంది. 201 పాయింట్లతో చార్లెస్ లెక్‌లెర్క్ (ఫెరారీ), సెర్గియో పెరెజ్ సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు.
Also read: Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 2nd కరెంట్ అఫైర్స్
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP