Skip to main content

Jaskaran Malhotra: ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టిన రెండో ఆటగాడు?

అంతర్జాతీయ వన్డేల్లో అరుదైన ఘనత నమోదైంది. ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టిన రెండో ఆటగాడిగా జస్కరన్‌ మల్హోత్రా (అమెరికా) నిలిచాడు.
Jaskaran Malhotra

ఒమన్‌లోని అల్‌ అమీరట్‌లో సెప్టెంబర్‌ 9న పపువా న్యూ గినియాతో జరిగిన రెండో వన్డేలో మీడియం పేసర్‌ గాడీ టోకా వేసిన 50వ ఓవర్లో జస్కరన్‌ వరుసగా ఆరు సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో అమెరికా 134 పరుగుల తేడాతో గెలిచింది. చండీగఢ్‌లో పుట్టి వలస వెళ్లిన జస్కరన్‌ అమెరికాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2007 వన్డే వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లో డాన్‌ వాన్‌ బంగ్‌ ఓవర్లో హెర్షల్‌ గిబ్స్‌ 6 సిక్సర్లు కొట్టగా... అంతర్జాతీయ టి20ల్లో యువరాజ్‌ సింగ్, కీరన్‌ పొలార్డ్‌ ఈ అరుదైన ఫీట్‌ను ప్రదర్శించారు.

గంగూలీపై బయోపిక్‌...

భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ జీవితంపై సినిమా నిర్మితం కానుంది. ఈ విషయాన్ని స్వయంగా గంగూలీ నిర్ధారించాడు. లవ్‌ రంజన్, అంకుర్‌ గార్గ్‌ కలిసి ‘లవ్‌ ఫిల్మ్‌స్‌’ బ్యానర్‌పై దీనిని నిర్మిస్తారు. గంగూలీ పాత్ర పోషించే నటుడు, దర్శకుడు తదితర వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : అంతర్జాతీయ వన్డేల్లో ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టిన రెండో ఆటగాడు?
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 9
ఎవరు    : జస్కరన్‌ మల్హోత్రా (అమెరికా జట్టు)
ఎక్కడ    : అల్‌ అమీరట్, ఒమన్‌
ఎందుకు : పపువా న్యూ గినియాతో జరిగిన రెండో వన్డేలో మీడియం పేసర్‌ గాడీ టోకా వేసిన 50వ ఓవర్లో జస్కరన్‌ వరుసగా ఆరు సిక్సర్లు బాదాడు
 
Published date : 11 Sep 2021 06:25PM

Photo Stories