Cricket: టి20 ప్రపంచకప్–2021లో విజేతగా నిలిచిన దేశం?
2021 ఏడాది ఐసీసీ టి20 ప్రపంచకప్(పురుషుల) విజేతగా ఆస్ట్రేలియా జట్టు నిలిచింది. నవంబర్ 14న యూఏఈలోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించి తొలిసారి ఈ ఫార్మాట్‌లో వరల్డ్ కప్‌ను అందుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. అనంతరం ఆసీస్ 18.5 ఓవర్లలో 2 వికెట్లకు 173 పరుగులు చేసి గెలిచింది. ఆస్ట్రేలియా జట్టుకు ఆరోన్ ఫించ్ సారథ్యం వహించగా, న్యూజిలాండ్ జట్టు కెప్టెన్‌గా కేన్ విలియమ్సన్ వ్యవహరించాడు.
రూ. 11 కోట్ల 91 లక్షల ప్రైజ్‌మనీ..
విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టుకు 16 లక్షల డాలర్లు (రూ. 11 కోట్ల 91 లక్షలు)... రన్నరప్ న్యూజిలాండ్ జట్టుకు 8 లక్షల డాలర్లు (రూ. 5 కోట్ల 95 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. మొత్తం 289 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్(ఆస్ట్రేలియా జట్టు) ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచాడు.
చదవండి: ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన క్రీడాకారిణి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021 ఏడాది ఐసీసీ టి20 ప్రపంచకప్(పురుషుల) విజేత
ఎప్పుడు : నవంబర్ 14
ఎవరు : ఆస్ట్రేలియా జట్టు
ఎక్కడ : దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్, యూఏఈ
ఎందుకు : ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టు న్యూజిలాండ్ జట్టుపై విజయం సాధించినందున..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్