Dhaka: ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన క్రీడాకారిణి?
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరుగుతున్న ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్–2021లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ స్వర్ణం పతకం సాధించింది. మహిళల కాంపౌండ్ విభాగంలో నవంబర్ 18న జరిగిన ఫైనల్లో సురేఖ 146–145తో కొరియా ఆర్చర్ యూహ్యూన్‌పై అద్భుత విజయం సాధించి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది.
రిషభ్ యాదవ్ ఏ క్రీడలో ప్రసిద్ధుడు?
మరోవైపు పురుషుల కాంపౌండ్ విభాగంలో భారత ఆర్చర్ అభిషేక్ వర్మ రజతాన్ని సాధించాడు. ఫైనల్లో అతడు 148–149తో కిమ్ జోంగ్‌హూ (కొరియా) చేతిలో ఓడాడు. కాంపౌండ్ మిక్స్‌డ్ విభాగంలో సురేఖ– రిషభ్ యాదవ్ (భారత్) జంట 154–155తో కిమ్ యున్‌హీ–చోయ్ యాంగ్‌హీ (కొరియా) ద్వయం చేతిలో ఓడి రజతంతో సంతృప్తి చెందింది.
చదవండి: బీడబ్ల్యూఎఫ్ అవార్డుకు ఎంపికైన భారత క్రీడాకారుడు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్–2021లో స్వర్ణం గెలిచిన క్రీడాకారిణి?
ఎప్పుడు : నవంబర్ 18
ఎవరు : ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ
ఎక్కడ : ఢాకా, బంగ్లాదేశ్
ఎందుకు : మహిళల కాంపౌండ్ విభాగంలో ఫైనల్లో సురేఖ 146–145తో కొరియా ఆర్చర్ యూహ్యూన్‌పై విజయం సాధించినందున..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్