Wrestling: ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యాలు గెలిచిన భారత అమ్మాయిలు?
మంగోలియా రాజధాని నగరం ఉలాన్‌బాటర్ వేదికగా జరగుతోన్న ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్–2022లో ఏప్రిల్ 21న భారత అమ్మాయిలు రెండు కాంస్య పతకాలతో మెరిశారు. 59 కేజీల విభాగంలో సరిత మోర్, 55 కేజీల కేటగిరీలో సుష్మ షోకీన్ కంచు పతకాలు గెలిచారు. ఆరంభ బౌట్లలో ఓడినా తర్వాతి రెండు బౌట్‌లలో వరుసగా దిల్‌ఫుజా ఇంబెటొవా (ఉజ్బెకిస్తాన్)పై 11–0 తేడాతో (టెక్నికల్ సుపీరియార్టీ)...ఆ తర్వాత దియానా కయుమొవా (కజకిస్తాన్)పై 5–2తో సరిత గెలిచింది. సుష్మ కూడా ఇదే తరహాలో ఆల్టిన్ షగయెవా (కజకిస్తాన్)పై 5–0తో, ఆపై సర్బినాజ్ జెన్‌బెవా (ఉజ్బెకిస్తాన్)ను 12–0 తే డాతో ఓడించి కాంస్యం ఖాయం చేసుకుంది. ఈ వెంట్ పురుషుల విభాగంలో గ్రీకో రోమన్ రెజ్ల ర్లు ఇప్పటికే ఐదు కాంస్యాలు గెలవడంతో ఓవరాల్ గా భారత్ పతకాల సంఖ్య ఏడు కాంస్యాలకు చేరింది.
Wrestling: ఆసియా సీనియర్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన ఆటగాడు?
లీడింగ్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్‌గా ఎంపికైన ఆటగాడు?
ప్రతిష్టాత్మక ‘విజ్డెన్’ వార్షిక అత్యుత్తమ ఐదుగురు క్రికెటర్ల జాబితా–2022లో భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రాలకు స్థానం లభించింది. ఇందులో రోహిత్, బుమ్రాలతో పాటు రాబిన్సన్, కాన్వే, డేన్ నికెర్క్ కూడా ఉన్నారు. 2021లో టెస్టుల్లో 1708 పరుగులు చేసిన జో రూట్ ‘లీడింగ్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్’గా ఎంపికయ్యాడు. ప్రధానంగా ఇంగ్లండ్ గడ్డపై చూపిన ప్రదర్శన ఆధారంగా ఈ ఆటగాళ్లను ఎంపిక చేస్తారు.
Asian Championships: అర్జున్ హలాకుర్కి ఏ క్రీడలో ప్రసిద్ధి చెందాడు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్–2022లో కాంస్య పతకాలు గెలిచిన భారత అమ్మాయిలు?
ఎప్పుడు : ఏప్రిల్ 21
ఎవరు : సరిత మోర్(59), సుష్మ షోకీన్(55)
ఎక్కడ : ఉలాన్‌బాటర్, మంగోలియా
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్