Wrestling: ఆసియా సీనియర్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన ఆటగాడు?
మంగోలియా రాజధాని ఉలాన్‌బాటర్ వేదికగా జరుగుతున్న ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్–2022 పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో భారత రెజ్లర్లు హర్‌ప్రీత్ సింగ్ (82 కేజీలు), సచిన్ సెహ్రావత్ (67 కేజీలు) కాంస్య పతకాలు గెలిచారు. ఏప్రిల్ 20న కాంస్య పతక పోరులో హర్‌ప్రీత్‌తో తలపడాల్సిన ఖతర్ రెజ్లర్ జఫర్ ఖాన్ గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దాంతో హర్‌ప్రీత్‌ను విజేతగా ప్రకటించారు. ఆసియా పోటీల్లో హర్‌ప్రీత్‌కిది ఐదో పతకం. మరో కాంస్య పతక బౌట్‌లో మహమూద్ (ఉజ్బెకిస్తాన్)పై సచిన్ గెలిచాడు.
Asian Championships: అర్జున్ హలాకుర్కి ఏ క్రీడలో ప్రసిద్ధి చెందాడు?
కార్తీక్ రెడ్డికి స్వర్ణం
యూఎస్‌ఏ ఓపెన్ అంతర్జాతీయ కరాటే టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ కుర్రాడు ఎ.కార్తీక్ రెడ్డి స్వర్ణ పతకం సాధించాడు. అమెరికాలో జరిగిన ఈ టోర్నీలో తిరుపతికి చెందిన కార్తీక్ అండర్–13 బాలుర కుమిటే టీమ్ విభాగంలో పసిడి పతకాన్ని నెగ్గాడు. 40 దేశాల నుంచి 300కు పైగా క్రీడాకారులు ఈ టోర్నీలో పాల్గొన్నారు.
Chess: లా రోడా ఓపెన్ టోర్నీలో విజేతగా నిలిచిన ఆటగాడు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్–2022 పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో కాంస్య పతకాలు గెలిచిన భారతీయులు?
ఎప్పుడు : ఏప్రిల్ 20
ఎవరు : హర్‌ప్రీత్ సింగ్ (82 కేజీలు), సచిన్ సెహ్రావత్ (67 కేజీలు)
ఎక్కడ : ఉలాన్‌బాటర్, మంగోలియా
ఎందుకు : కాంస్య పతక పోరులో హర్‌ప్రీత్‌తో తలపడాల్సిన ఖతర్ రెజ్లర్ జఫర్ ఖాన్ గాయం కారణంగా బరిలోకి దిగకపోవడంతో, మరో కాంస్య పతక బౌట్‌లో మహమూద్ (ఉజ్బెకిస్తాన్)పై సచిన్ గెలిచినందున..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్