Table Tennis Senior Nationals: జాతీయ టీటీ చాంపియన్‌షిప్‌లో శ్రీజ ‘ట్రిపుల్’ ధమాకా
మార్చి 27న ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తరఫున పోటీపడిన శ్రీజ మహిళల సింగిల్స్ విభాగంలో టైటిల్ నిలబెట్టుకోగా.. డబుల్స్ విభాగంలో తన భాగస్వామి దియా చిటాలెతో కలిసి విజేతగా నిలిచింది. మహిళల టీమ్ ఈవెంట్‌లో శ్రీజ, దియా, అహిక ముఖర్జీలతో కూడిన ఆర్‌బీఐ జట్టు టైటిల్ సాధించింది.
☛ సింగిల్స్ ఫైనల్లో శ్రీజ 9–11, 14–12, 11–7, 13–11, 6–11, 12–10తో సుతీర్థ ముఖర్జీ (పశ్చిమ బెంగాల్)పై గెలిచి రూ. 2 లక్షల 75 వేల ప్రైజ్‌మనీని దక్కించుకుంది.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)
☛ డబుల్స్ ఫైనల్లో శ్రీజ–దియా ద్వయం 11–7, 11–7, 8–11, 14–12తో స్వస్తిక ఘోష్–శ్రుతి అమృతే (మహారాష్ట్ర) జోడీని ఓడించింది.
☛ టీమ్ ఫైనల్లో ఆర్‌బీఐ 3–2తో తమిళనాడును ఓడించింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో మొహమ్మద్ అలీ–వంశ్ సింఘాల్ (తెలంగాణ) జోడీ 6–11, 7–11, 6–11తో జీత్ చంద్ర–అంకుర్ భట్టాచార్య (పశ్చిమ బెంగాల్) జంట చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది.