ACF Award: ఉత్తమ మహిళా చెస్ జట్టుగా భారత్
Sakshi Education
ఆసియా చెస్ సమాఖ్య (ఏసీఎఫ్) 2022 వార్షిక అవార్డులను ప్రకటించారు. ఉత్తమ మహిళా చెస్ జట్టుగా భారత్‌కు పురస్కారం లభించింది.
ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణ వల్లి హారిక, వైశాలి, తానియా సచ్‌దేవ్, భక్తి కులకర్ణిలతో కూడిన భారత జట్టు గత ఏడాది సొంతగడ్డపై తొలిసారి జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో మహిళల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది. ఈ ప్రదర్శనకుగాను ఏసీఎఫ్ ఉత్తమ జట్టు అవార్డు హంపి బృందానికి దక్కింది. భారత్‌కే చెందిన యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారం గెల్చుకున్నాడు. గత చెస్ ఒలింపియాడ్‌లో తమిళనాడుకు చెందిన గుకేశ్ అత్యధికంగా తొమ్మిది పాయింట్లు స్కోరు చేసి స్వర్ణ పతకాన్ని సాధించాడు. గత ఏడాది మార్చిలో గుకేశ్ 2700 ఎలో రేటింగ్‌ను దాటి ఈ ఘనత సాధించిన ఆరో భారతీయ చెస్ ప్లేయర్‌గా నిలిచాడు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (29 జనవరి - 04 ఫిబ్రవరి 2023)
Published date : 04 Mar 2023 05:10PM