అత్యవసర వినియోగానికి కోవోవాక్స్... డబ్ల్యూహెచ్ ఓకే!
వచ్చే ఆరు నెలల్లో దీనిని విడుదల చేయాలని భావిస్తున్నట్లు ఇటీవల అధార్ చెప్పారు. ప్రస్తుతం ఇది ట్రయిల్స్ దశలో ఉంది. ట్రయల్స్‌లో ఆశాజనక ఫలితాలు వచ్చాయని కంపెనీ తెలిపింది. కొత్త టీకా వినియోగానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థకు దరఖాస్తు చేసినట్లు సీరమ్ గత నెలలో వెల్లడించింది.
ముఖ్యమైన వైరల్ వ్యాధులు-వాటి లక్షణాలు-ఎలా వ్యాపిస్తాయి ?
నోవావాక్స్ రూపొందించిన NVX& CoV2373 టీకా సామర్థ్యానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని డబ్ల్యూహెచ్‌వోకు అందించినట్లు పేర్కొంది. ఈ టీకా 90శాతం సమర్థత కలిగి ఉన్నట్లు ప్రయోగాల్లో వెల్లడైంది. బ్రిటన్, దక్షిణాఫ్రికాలో జరిపిన ప్రయోగాల్లోనూ 89 శాతం ప్రభావశీలత కలిగినట్లు తేలింది.
గాయాలు త్వరగా మానటానికి ఉపయోగపడే విటమిన్ ఏది?
ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌లకు భిన్న సాంకేతికతతో నోవావాక్స్‌ను అభివృద్ధి చేశారు. ముఖ్యంగా స్పైక్ ప్రొటీన్‌ను గుర్తించి, వైరస్‌పై దాడి చేసేందుకు శరీరాన్ని సిద్ధం చేసేలా ఈ వ్యాక్సిన్ రూపొందించారు. డీజీసీఐ తనిఖీల ఫలితాల ఆధారంగా నోవోవాక్స్ వాడేందుకు అత్యవసర అనుమతినిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. అయితే భారత్‌లో దీని అత్యవసర వినియోగానికి డీజీసీఐ నుంచి అనుమతులురావాల్సిఉంది. ప్రస్తుతం 18ఏళ్లు పైబడినవారికే భారత్‌లో కరోనా టీకాలు ఇస్తున్నారు .