Cured Of HIV: ఎయిడ్స్ సంపూర్ణంగా నయమైన తొలి పేషెంట్ ఎవరు?
మానవ వైద్య చరిత్రలో మరో అద్భుతం చోటు చేసుకుంది. తొలిసారి ఒక మహిళకు ఎయిడ్స్ పూర్తిగా నయమైంది. స్టెమ్‌సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ (మూలకణ మార్పిడి) చికిత్సతో సదరు మహిళ సంపూర్ణంగా ఎయిడ్స్ కారక హెచ్‌ఐవీ వైరస్ నుంచి విముక్తి పొందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో మానవ చరిత్రలో ఎయిడ్స్ సంపూర్ణంగా నయమైన మూడో పేషెంట్‌గా, తొలి మహిళా పేషెంట్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. ఈ కేసు వివరాలను పరిశోధకులు ఫిబ్రవరి 16న 29వ కాన్ఫరెన్స్ ఆర్ రెట్రోవైరసెస్ అండ్ ఆపర్చునిస్టిక్ ఇన్‌ఫెక్షన్స్(సీఆర్‌ఓఐ) అనే సదస్సులో వెల్లడించారు. అమెరికాలోని కొలరాడో రాష్ట్రం, డెన్‌వర్ నగరంలో ఫిబ్రవరి 12 నుంచి 16వ తేదీ వరకు సీఆర్‌ఓఐ సదస్సును నిర్వహించారు.
స్టెమ్ సెల్ మార్పిడి అనంతరం సదరు మహిళ(అమెరికా) 14 నెలలుగా ఏఆర్‌టీ(యాంటీ వైరల్ థెరపీ) తీసుకోవడం లేదని, అయినా ఆమెలో హెచ్‌ఐవీ వైరస్ కనిపించలేదని పరిశోధకులు తెలిపారు. బొడ్డుపేగు నుంచి తీసిన స్టెమ్ సెల్స్‌తో హెచ్‌ఐవీ రెమిషన్ సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ పరిశోధనను యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, జాన్స్‌హాప్‌కిన్స్ యూనివర్సిటీలకు చెందిన రిసెర్చర్లు ఐఎంపీఏఏసీటీ పీ1107 (ఇంటర్నేషనల్ మాటర్నల్ పీడియాట్రిక్ అడాలసెంట్ ఎయిడ్స్ క్లీనికల్ ట్రయిల్ నెట్‌వర్క్) ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ నెట్‌వర్క్‌ను 2015లో ఆరంభించారు.
తొలి పేషెంట్..
గతంలో ‘బెర్లిన్ పేషెంట్’ గా పిలిచే టిమోతీ రే బ్రౌన్ అనే మగ పేషెంటు 12 ఏళ్ల పాటు హెచ్‌ఐవీ రెమిషన్ (అంటే యాంటీ వైరల్ మందులు వాడటం ఆపేసినా వైరస్ ప్రబలకపోవడం) పొందాడు. దీంతో ఎయిడ్స్ సంపూర్ణంగా నయమైన తొలి పేషెంట్‌గా టిమోతీ గుర్తింపు పొందాడు. అనంతరం ‘లండన్ పేషెంట్’ అనే ఆడమ్ కాసిల్జో అనే వ్యక్తి 30 నెలల నుంచి హెచ్‌ఐవీ రెమిషన్‌లో ఉన్నాడు. వీరి తర్వాత ప్రస్తుత మహిళా పేషెంటే హెచ్‌ఐవీ రెమిషన్ లేదా ఎయిడ్స్ నుంచి ఉపశమనం పొందింది.
చదవండి: ఏఐ ఫేషియల్ టెక్నాలజీతో కూడిన తొలి స్కూటర్ ఏది?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్