State Startup –2021 ర్యాంకులు - తెలంగాణ టాప్
వర్ధమాన పారిశ్రామికవేత్తల కోసం స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడంలో అత్యున్నత పనితీరు (టాప్ పెర్ఫార్మర్) కనబరిచిన జాబితాలో తెలంగాణ నిలిచింది. విహబ్ ద్వారా స్టార్టప్‌లలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తోందంటూ కేంద్రం నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. స్టార్టప్‌లలోని ఏడు సంస్కరణల విభాగంలో అత్యధిక స్కోరింగ్ సాధించిన నాయకత్వ రాష్ట్రాల్లోనూ తెలంగాణ సత్తా చాటింది. ఇన్‌స్టిట్యూషనల్ చాంపియన్, ఇన్నోవేటివ్ లీడర్, ఇంక్యుబేషన్ హబ్, కెపాసిటీ బిల్డింగ్ పయనీర్ విభాగాల్లో తెలంగాణ లీడర్‌గా నిలిచింది. జూలై 4న ఢిల్లీలో డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) నిర్వహించిన సమావేశంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ రాష్ట్రాల స్టార్టప్ ర్యాంకింగ్–2021 నివేదికను విడుదల చేశారు. ఆయా రాష్ట్రాలు చేపట్టిన సంస్కరణల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, అత్యుత్తమ రాష్ట్రాలు, నాయకత్వం వహించే రాష్ట్రాలు, ఔత్సాహిక నాయకత్వ రాష్ట్రాలు, అభివృధ్ధి చెందుతున్న స్టార్టప్ ఎకోసిస్టమ్ రాష్ట్రాలు అనే ఐదు విభాగాల కింద రాష్ట్రాలకు ర్యాంకులు ప్రకటించింది.
Also read: Alluri Sitarama Raju: వైరాగ్యం నుంచి విప్లవం వైపు...
24 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో అత్యున్నత పనితీరు కనబరిచిన జాబితాలో తెలంగాణతోపాటు కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, జమ్మూకశ్మీర్ నిలిచాయి. అత్యుత్తమ పనితీరు జాబితాలో గుజరాత్, కర్ణాటకతోపాటు చిన్న రాష్ట్రాల జాబితాలో మేఘాలయ నిలిచాయి. అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ పర్యావరణ వ్యవస్థల విభాగంలో ఆంధ్రప్రదేశ్, బిహార్, మిజోరాం, లద్దాఖ్ స్థానం దక్కించుకున్నాయి.
Also read: Central Election Commission: పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేసే అధికారం ఇవ్వండి
దేశవ్యాప్తంగా ప్రస్తుతం 70,809 స్టార్టప్‌లు ఉన్నాయని, వీటిని ప్రభుత్వం గుర్తించిందని కేంద్ర పరిశ్రమలశాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు . ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకో సిస్టమ్‌గా భారత్ అవతరించిందన్నారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP