X-rays: ఏఐ ఆధారిత కరోనా పరీక్షా విధానాన్ని ఏ దేశస్థులు ఆవిష్కరించారు?
కరోనాను డయాగ్నైజ్ చేసేందుకు (గుర్తించేందుకు) కృత్తిమ మేధ(ఏఐ) ఆధారిత నూతన పరీక్షా విధానాన్ని స్కాట్లాండ్ సైంటిస్టులు ఆవిష్కరించారు. నిమిషాల్లోనే కరోనా సోకిందా లేదా తేల్చే ఈ పరీక్ష ఎక్స్ కిరణాల ఆధారంగా పనిచేస్తుంది. ఈ పరీక్షా విధానం 98% కచ్ఛితమైన ఫలితాలు అందిస్తుందని స్కాట్లాండ్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. అయితే పీసీఆర్ పరీక్షలాగా ఈ పరీక్షతో కరోనాను తొలి దశలో గుర్తించలేమని పేర్కొన్నారు. పీసీఆర్ పరీక్ష అందుబాటులో లేని ప్రాంతాల్లో ఈ పరీక్షా విధానం ఉపయుక్తంగా ఉండొచ్చన్నారు. పీసీఆర్ పరీక్షలో కరోనా వైరస్‌ను గుర్తించేందుకు రెండు గంటల సమయం పడుతుంది.
మనిషకి పంది మూత్రపిండాలు..
అమెరికాలోని అలబామ రాష్ట్రంలో జన్యుమార్పిడి చేసిన ఓ పంది నుంచి సేకరించిన మూత్రపిండాలను.. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తికి అమర్చారు. అనంతరం మూడు రోజుల పాటు వాటి పనితీరును పరిశీలించారు. పేషంట్ శరీరం ఆ మూత్రపిండాలను తిరస్కరించిన సంకేతాలేవీ కనిపించలేదని అలబామా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ జేమీ లాకీ జనవరి 20న తెలిపారు. అవి సక్రమంగా పనిచేసినట్లు వెల్లడించారు.
చదవండి: కరోనా ఎండమిక్ దశ అంటే ఏమిటీ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : కృత్తిమ మేధ(ఏఐ) ఆధారిత నూతన పరీక్షా విధానాన్ని ఏ దేశ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు?
ఎప్పుడు : జనవరి 20
ఎవరు : స్కాట్లాండ్ యూనివర్సిటీ పరిశోధకులు
ఎందుకు : కరోనాను డయాగ్నైజ్ చేసేందుకు (గుర్తించేందుకు)..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్