Covid-19: కరోనా ఎండమిక్ దశ అంటే ఏమిటీ?
దేశంలో కరోనా మహమ్మారి 2022, మార్చి నాటికి ఎండమిక్ దశకు చేరుకుంటుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అంచనా వేసింది. ‘‘డెల్టా వేరియంట్ స్థానాన్ని ఒమిక్రాన్ ఆక్రమిస్తే కరోనాకి అదే ముగింపు అవుతుంది. కొత్తగా ఏ వేరియంట్లు రాకపోతే ఇక కరోనా ముగిసిపోయినట్టే. డిసెంబర్ 11 నుంచి మొదలైన కరోనా థర్డ్ వేవ్ మూడు నెలల్లో ముగిసిపోతుంది. కరోనా ఎండమిక్ దశ మార్చి 11 నుంచి మొదలయ్యే అవకాశాలున్నాయి’’ అని ఐసీఎంఆర్ నిపుణుల బృందం పేర్కొంది.
ఎండమిక్ దశ అంటే..
ఎండమిక్ దశ అంటే దేశవ్యాప్తంగా ఒకేసారి కరోనా ఉధృతి కనపడకుండా అక్కడక్కడా విసిరేసినట్లు కొద్ది ప్రదేశాలకు కరోనా వ్యాప్తి పరిమితం కావడం, కరోనా సాధారణ వైరస్‌గా మారిపోయి ప్రజలు దానితో సహజీవనం చేసే పరిస్థితికి చేరుకోవడం.
అత్యవసర పరిస్థితులు ఉండవ్ : డబ్ల్యూహెచ్‌ఓ
కోవిడ్–19తో విధించే అత్యవసర పరిస్థితులు 2022 ఏడాదితో ముగిసిపోయే అవకాశాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అంచనా వేస్తోంది. వ్యాక్సిన్ పంపిణీలో అసమానతలను నిర్మూలించి.. అన్ని దేశాలకు సమానంగా లభ్యమయ్యేలా చర్యలు చేపడితే కోవిడ్–19 మరణాలు, ఆస్పత్రిలో చేరికలు, లాక్‌డౌన్‌లు వంటివి అరికట్టవచ్చునని, ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి ఇక రాకపోవచ్చునని పేర్కొంది.
జెనిసిస్ ప్రైజ్‌కి ఎంపికైన వ్యక్తి?
ఫార్మా దిగ్గజం ఫైజర్ కంపెనీ సీఈఓ ఆల్బర్ట్ బౌర్లా ప్రఖ్యాత జెనిసిస్ బహుమతికి ఎంపికయ్యారు. 2022, జూన్‌లో ఈ బహుమతి ప్రదానం జరుగుతుంది. ఈ బహు మతి విలువ 10 లక్షల డాలర్లు. కోవిడ్ టీకా అభివృద్ధి చేయడంలో కృషికిగాను ఆయనకు ఈ బహుమతి దక్కింది. బహుమతికి ఎవరిని ఎంపిక చేయాలని ఆన్‌లైన్‌లో ఓటింగ్ నిర్వహించగా ఎక్కువగా ఆల్బర్ట్‌కు 2లక్షలకు పైగా ఓట్లు వచ్చాయని జెనిసిస్ ఫౌండేషన్ తెలిపింది.
చదవండి: ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ ఎక్కడ ఉంది?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్