Skip to main content

Prithvi 2 Test Success‌ : పృథ్వీ 2 పరీక్ష సక్సెస్‌

Prithvi - 2 Test Success‌

బాలాసోర్‌(ఒడిశా): దేశీయంగా తయారుచేసిన అణ్వస్త్ర సామర్థ్య పృథ్వీ–2 క్షిపణిని రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) బుధవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ నుంచి రాత్రి ఏడున్నర ప్రాంతంలో పరీక్షించారు. అత్యంత ఖచ్చితత్వంతో నిర్దేశిత పథంలో మిస్సైల్‌ దూసుకెళ్లిందని సంస్థ వెల్లడించింది. భూతలం నుంచి 350 కి.మీల దూరం దూసుకెళ్లి భూతల లక్ష్యాలను చేధించే పృథ్వీ క్షిపణి పరీక్ష అన్ని నిర్దేశిత ప్రమాణాలను అందుకుందని సంస్థ పేర్కొంది. రెండు ఇంజన్లు ఉండే పృథ్వీ దాదాపు వేయి కిలోల బాంబులను మోసుకెళ్లగలదు. 

Published date : 20 Jun 2022 04:35PM

Photo Stories