Skip to main content

European C-295: తయారీ హబ్‌గా భారత్‌

వడోదర:  రవాణా విమానాల తయారీలో భారత్‌ అగ్రగామిగా మారబోతోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్‌లోని వడోదరలో రూ.22 వేల కోట్లతో యూరోపియన్‌ సి–295 మధ్యతరహా రవాణా విమానాల తయారీ కేంద్రానికి ఆయన అక్టోబర్  29న శంకుస్థాపన చేశారు.
PM Modi launches project to manufacture C-295,
PM Modi launches project to manufacture C-295,

భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) కోసం ఈ విమానాలను తయారు చేయబోతున్నారు. ప్రపంచంలో భారత్‌ అతిపెద్ద తయారీ హబ్‌గా అవతరించిందని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా తెలిపారు. దేశంలో ఆర్థిక సంస్కరణ విషయంలో నూతన చరిత్రను రాస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలు స్థిరంగా, దార్శనికతతో కూడి ఉన్నాయన్నారు. కొత్త మైండ్‌సెట్, కొత్త వర్క్‌కల్చర్‌తో ఇండియా ముందడుగు వేస్తోందని చెప్పారు. పెద్ద పెద్ద వాణిజ్య విమానాలు కూడా మన దేశంలో తయారయ్యే రోజులను మనం చూడబోతున్నామని తెలిపారు. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’తోపాటు ‘మేక్‌ ఫర్‌ వరల్డ్‌’ అనేదే మన నినాదమని వివరించారు. సి–295 ఎయిర్‌క్రాఫ్ట్‌లతో భారత వైమానిక దళం బలోపేతం కావడంతోపాటు మనదేశంలో విమానయాన రంగానికి ప్రోత్సాహం లభిస్తుందని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.  

Also read: SpaceX: యూరప్‌ అంతరిక్ష ప్రయోగాలకు స్పేస్‌ ఎక్స్‌ దన్ను

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 31 Oct 2022 03:28PM

Photo Stories