Skip to main content

Snake Bite: పాము కాటుకు కొత్త విరుగుడు..

New antidote for snake bite

బెంగుళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్‌సీ) శాస్త్రవేత్తలు అద్భుతం సృష్టించారు. పాము కాటుకు కొత్త తరహా విరుగుడును కనుగొన్నారు. పాము విషాన్ని నిర్వీర్యం చేసే కృత్రిమ యాంటీబాడీలను తయారు చేశారు. దాదాపు అన్ని రకాల పాము విషాలకు ఆ యాంటీబాడీలు విరుగుడుగా పనిచేయనున్నట్లు తెలుస్తోంది. హెచ్‌ఐవీ, కోవిడ్‌ 19 రోగుల్లో యాంటీబాడీ స్క్రీనింగ్‌ కోసం వాడిన విధానాన్ని సింథటిక్‌ యాంటీబాడీలు తయారు చేసేందుకు అనుసరించారు. ఆ ప్రక్రియలోనే విషాన్ని నిర్వీర్యం చేసే కొత్త విధానాన్ని డెవలప్‌ చేశారు.తొలిసారి ఆ టెక్నిక్‌ ద్వారా పాము కాటుకు చికిత్స చేస్తున్నట్లు ఐఐఎస్సీ శాస్త్రవేత్తలు తెలిపారు. అమెరికాకు చెందిన స్క్రీప్స్‌ రీసర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు కూడా ఆ బృందంలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల విష సర్పాల నుంచి రక్షణ పొందే రీతిలో యూనివర్సల్‌ యాంటీబాడీని అభివృద్ధి చేస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. కోబ్రా, కింగ్‌ కోబ్రా, క్రెయిట్, మాంబా లాంటి ప్రమాదకర సర్పాలు ఆ లిస్టులో ఉన్నాయి.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 28 Feb 2024 10:49AM

Photo Stories