ISRO: పుష్పక్‌ను విజయవంతంగా ల్యాండ్ చేసిన ఇస్రో
మార్చి 22వ తేదీ ఉదయం 7 గంటలకు ఇస్రో 'పుష్పక్' అనే రీ యూజబుల్ లాంచ్ వెహికల్ (ఆర్‌ఎల్‌వీ) ను విజయవంతంగా ప్రయోగించింది.
కర్ణాటకలోని చాలకెరెలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్(ఏటీఆర్) నుంచి ఇస్రో ఈ ప్రయోగాన్ని నిర్వహించింది.
పుష్పక్ ఆర్‌ఎల్‌వీని తొలుత ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన హెలికాప్టర్‌లో 4.5 కిలోమీటర్ల ఎత్తులో వదిలేశారు. ఆ తర్వాత భూమి నుంచి ఎలాంటి నియంత్రణ లేకుండా స్వతంత్రంగా ముందు నిర్ణయించిన చాలకెరె ఏటీఆర్ రన్‌వేపై కచ్చితమైన ప్రదేశంలో పుష్పక్ ల్యాండ్ అయింది. అంతరిక్ష ప్రయోగాల ఖర్చు తగ్గించుకునేందుకుగాను లాంచింగ్ రాకెట్‌లను తిరిగి వాడుకునే క్రమంలో ఇస్రో ఆర్‌ఎల్‌వీ ప్రయోగాలను నిర్వహిస్తోంది.
‘పుష్పక్ లాంచ్ వెహికిల్ పై భాగంలో చాలా ఖరీదైన ఎలక్ట్రానిక్ పరికరాలుంటాయి. వీటిని సురక్షితంగా భూమిపైకి తిరిగి తీసుకురాగలిగితే మళ్లీ వాడుకునేందుకు వీలుంటుంది’అని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. పుష్పక్ ఆర్‌ఎల్‌వీలో ఫ్యూసిలేజ్(బాడీ), నోస్ క్యాప్, డబుల్ డెల్టా రెక్కలు, ట్విన్ వర్టికల్ టెయిల్స్ భాగాలుంటాయి.
Agni-5 Missile: అగ్ని–5 క్షిపణి.. శత్రువుకు వణుకే..!