ISRO-NASA: నాసా–ఇస్రో ఉపగ్రహం సిద్దం, త్వరలో భారత్‌కు తరలింపు
Sakshi Education
భూమిపై పరిశీలనల కోసం అమెరికా అంతరిక్ష సంస్థ–నాసా, భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)లు సంయుక్తంగా ఆభివృద్ధి చేసిన ‘నిసార్’ ఉపగ్రహం పూర్తిస్థాయిలో సిద్ధమైంది.
ఈ నెలలోనే దీన్ని భారత్ కు పంపనున్నారు. సెప్టెంబర్‌లో ఇది అంతరిక్షంలోకి పయనం కానుంది. నిసార్ ప్రాజెక్టును ఇరు దేశాల అంతరిక్ష సంస్థలు చేపడుతున్నాయి. ఈ ఉపగ్రహం బరువు 2,800 కిలోలు. దీనికోసం నిర్మించిన ఎస్–బ్యాండ్ సింథటిక్ అపెర్చర్ రాడార్(సార్)ను భారత్ 2021 మార్చిలో పంపింది. నాసా రూపొందించిన ఎల్ బ్యాండ్ భూకంపాలు, కొండచరియలు విరిగిపడటానికి, అగ్నిపర్వత విస్పోటాలకు ముందు పరిసరాల్లో చోటుచేసుకునే చిన్నపాటి వైరుధ్యాలను ఈ ఉపగ్రహం గుర్తిస్తుంది. జోషిమఠ్ తరహాలో భూమి కుంగడం లాంటి ప్రకృతి విపత్తులను ముందే పసిగట్టడానికి ఇది సాయపడుతుంది. రాత్రివేళల్లో, అన్నిరకాల వాతావరణ పరిస్థితుల్లోనూ పరిశీలనలు సాగించగలదు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 18 Feb 2023 01:54PM