Iran: మూడు ఉపగ్రహాలను ప్రయోగించిన ఇరాన్
Sakshi Education
మూడు ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపినట్లు ఇరాన్ ప్రకటించింది. సిమోర్ఘ్ రాకెట్‌తో వాటిని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు తెలిపింది.
సెమ్నాన్ ప్రావిన్స్‌లోని ఇమామ్ ఖొమైనీ అంతరిక్ష కేంద్రంలో ఈ ప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో మహ్దా అనేది పరిశోధక ఉపగ్రహం కాగా, కేహాన్ –2, హతెఫ్–1 అనేవి జీపీఎస్, కమ్యూనికేషన్ కు సంబంధించిన నానో శాటిలైట్లని ఇరాన్ ప్రభుత్వ టీవీ తెలిపింది. గాజాపై యుద్ధంలో సైనికపరంగా చేసుకోనప్పటికీ.. ఇటీవల జరిగిన ఇస్లామిక్‌స్టేట్ భారీ ఆత్మాహుతి దాడి, ఇరాన్ అండదండలున్న హౌతీ తిరుగుబాటుదారులు విదేశీ నౌకలపై దాడులు చేయడం వంటివి ఇరాన్ మతపెద్దలపై ఒత్తిడి పెంచింది. ఈ నేపథ్యంలోనే ఉపగ్రహ ప్రయోగాలు చేపట్టినట్లుగా భావిస్తున్నారు.
Published date : 06 Feb 2024 09:42AM