21న GSLV మార్క్3 ప్రయోగం

నెట్‌వర్క్ యాక్సెస్ అసోసియేషన్ లిమిటెడ్ (వన్‌వెబ్) ఇస్రో, న్యూస్పేస్ ఇండియా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్‌లు ఈ ప్రయోగాన్ని చేసేందుకు ఇటీవల ఒప్పందం చేసుకున్నారు. వన్‌వెబ్ ఇండియా–1 పేరుతో 36 ఉపగ్రహాలను ఒక్కటిగా చేసి వాణిజ్యపరంగా రోదసీలోకి జీఎస్‌ఎల్‌వీ మార్క్3 రాకెట్ ద్వారా పంపేందుకు సిద్ధం చేస్తున్నారు. ఇన్నాళ్లూ పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌నే వాణిజ్యపరమైన ప్రయోగాలకు వాడారు.
Also read: Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 30th కరెంట్ అఫైర్స్
జీఎస్‌ఎల్‌వీ మార్క్3 భారీ రాకెట్‌ను వాణిజ్యపరమైన ప్రయోగాలకు వాడటం ఇదే తొలిసారి. ప్రాజెక్టు ఒప్పందంలో భాగంగా 36 ఉపగ్రహాలను లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లో ప్రవేశపెడతారు. ‘వన్‌వెబ్ అనేది గ్లోబల్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్. ఇది అంతరిక్ష వ్యాపారాలకు, ప్రభుత్వాలకు వెబ్ కనెక్టివిటి సేవలు అందించే విధంగా రూపొందించారు’ అని ఇస్రో పేర్కొంది.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP