Skip to main content

Gaganyaan: 2024 చివరికల్లా.. మానవసహిత గగన్‌యాన్‌

2024 చివరికల్లా మానవసహిత గగన్‌యాన్‌ ప్రయోగం నిర్వహిస్తామని షార్‌ డైరెక్టర్‌ ఆర్ముగం రాజరాజన్‌ ప్రకటించారు.

జ‌న‌వ‌రి 26న‌ శ్రీహరికోట స్పేస్‌ సెంట్రల్‌ స్కూల్‌ మైదానంలో గణతంత్ర వేడుకల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గగన్‌యాన్‌కు సంబంధించి ఇప్పటికే పలు భూస్థిర పరీక్షలు నిర్వహించాం. మరో 30 రకాల పరీక్షలు, క్రూ మాడ్యూల్‌ ప్రయోగం జరుపుతాం. ముందుగా రెండు మానవరహిత ప్రయోగాలు, ఆ తర్వాత భారీ ఎల్‌వీఎం–3 రాకెట్‌ ద్వారా వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లే ప్రయోగం ఉంటాయి. 2023లో 11 ప్రయోగాలు చేపట్టనున్నాం.
పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఐదు రాకెట్లు, ఎల్‌వీఎం–3లో రెండు, జీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో రెండు, ఎస్‌ఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో రెండు ప్రయోగాలుంటాయి. ఫిబ్రవరి మూడో వారంలో ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ2 ప్రయోగం, ఆ తర్వాత ఐదు పీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ద్వారా వాణిజ్యపరంగా విదేశీ ఉపగ్రహాలతో పాటు సూర్యుడిపై పరిశోధనకు ఆదిత్య–ఎల్‌1 ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నాం. ఎల్‌వీఎం–3 రాకెట్ల ద్వారా వన్‌వెబ్‌ కంపెనీకి చెందిన 36 ఉపగ్రహాలతో పాటు చంద్రయాన్‌–3 ప్రయోగానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చెప్పారు. ప్రైవేట్‌ ప్రయోగాలకు సిద్ధమన్నారు.  

ISRO:‘గగన్‌యాన్‌’లో ముందడుగు.. పారాచూట్ల పరీక్ష సక్సెస్‌

 

Published date : 27 Jan 2023 04:50PM

Photo Stories