Artificial Heart: కృత్రిమ గుండెను తయారు చేసిన ఐఐటీ కాన్పూర్ వైద్యులు
Sakshi Education
గుండె జబ్బులు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చిన్న వయసులోనే గుండె జబ్బులు వేధిస్తున్నాయి. గుండెపోటుకు గురైన వ్యక్తిని ఆపదలో ఆదుకునేందుకు కాన్పూర్‌లోని ఐఐటీ వైద్య నిపుణులు కృత్రిమ గుండెను తయారు చేశారు. దీనిద్వారా గుండెను మార్పిడి చేసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వచ్చే ఏడాది దీనిపై మరింత లోతుగా పరిశోధనలు జరిపిన అనంతరం రానున్న రెండేళ్లలో మనుషులకు కృత్రిమ గుండెను అమర్చేలా సిద్ధం చేయనున్నట్లు తెలిపారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 06 Jan 2023 05:31PM