Skip to main content

ICMR-VCRC: డెంగీ, చికున్‌గున్యాకు చెక్‌

ICMR-VCRC Develops Bacteria-Infected Mosquitoes To Control Dengue
ICMR-VCRC Develops Bacteria-Infected Mosquitoes To Control Dengue

డెంగీ, చికున్‌గున్యా వ్యాధులతో సతమతమవుతున్న భారతీయులకు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌) కొత్త శుభవార్త తెచ్చింది. ఈ రెండు వ్యాధుల వ్యాప్తికి కారణమయ్యే వైరస్‌లులేని లార్వాలను మాత్రమే ఉత్పత్తిచేసే ఆడ ఎడీస్‌ ఈజిప్టీ జాతి దోమలను ఐసీఎంఆర్, వెక్టర్‌ కంట్రోల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (వీసీఆర్‌సీ–పుదుచ్చేరి)లు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. వ్యాధికారక వైరస్‌లున్న మగ దోమలు ఈ ఆడదోమలతో కలిస్తే వైరస్‌రహిత లార్వాలు ఉత్పత్తి అవుతాయి. వీటిల్లో వైరస్‌లుండవు కనుక వాటి నుంచి వచ్చే దోమలు డెంగీ, చికున్‌గున్యాలను వ్యాపింపచేయడం అసాధ్యం. డబ్ల్యూమేల్, డబ్ల్యూఅల్బీ వోల్బాకియా అనే రెండు కొత్త జాతుల ఆడ ఎడీస్‌ ఈజిప్టీ దోమలను శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. ఇందుకోసం వీరు నాలుగేళ్లుగా పరిశోధన చేస్తున్నారు. దీన్ని జనబాహుళ్యంలోకి తేవడానికి ప్రభుత్వ అనుమతులు రావాల్సి ఉంది. డెంగీ, చికున్‌గున్యా అధికంగా ఉన్న జనావాసాల్లో ప్రతీ వారం ఈ రకం ఆడదోమలను వదలాల్సి ఉంటుందని ఐసీఎంఆర్, వెక్టర్‌ కంట్రోల్‌ రీసెర్చ్‌ సెంటర్‌(వీసీఆర్‌సీ–పుదుచ్చేరి) డైరెక్టర్‌ డాక్టర్‌ అశ్వనీ కుమార్‌ చెప్పారు.

Also read: GK Science & Technology Quiz: ఇస్రో ఏ సంవత్సరం నాటికి వీనస్ (శుక్రయాన్) మిషన్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది?

Published date : 08 Jul 2022 06:08PM

Photo Stories