Prithvi-II Missile: ’ఫృథ్వీ–2’ ప్రయోగం విజయవంతం
Sakshi Education
Prithvi-II: ఫృథ్వీ–2 బాలిస్టిక్ మిస్సైల్‌ను విజయవంతంగా ప్రయోగించిన దేశం?
షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ ఫృథ్వీ–2ను భారత్ విజయవంతంగా ప్రయోగించింది. ఉపరితలం నుంచి ఉపరితలం పైన ఉన్న లక్ష్యాలను ఛేదించ గల ఈ క్షిపణిని ఒడిశాలోని తీరప్రాంతం చాందీపూర్‌లో ఉన్న ‘ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్’(ఐటీఆర్) ల్యాబ్ నుంచి పరీక్షించినట్టు రక్షణశాఖ వెల్లడించింది. నిర్దేశిత లక్ష్యాలను ఈ క్షిపణి అత్యంత కచ్చితత్వంతో ఢీకొట్టిందని తెలిపింది. ఈ క్షిపణిని డీఆర్‌డీవో స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది. అణ్వాయుధ సామర్థ్యం గల ఈ మిస్సైల్ 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. రెండు లిక్విడ్ ప్రొపల్షన్ ఇంజిన్లను కలిగిన ఫృథ్వీ–2.. 500/100 కిలోల వార్ హెడ్‌లను మోసుకెళ్లగలదు.
DRDO: వీఎల్–ఎస్‌ఆర్‌ఎస్‌ఏఎం ప్రయోగ పరీక్షను ఎక్కడ నిర్వహించారు?
Published date : 28 Jun 2022 05:21PM