Skip to main content

chandrayaan-3: ‘చంద్రయాన్‌–3’ ప్రీలాంచ్‌ పరీక్ష విజయవంతం

చంద్రయాన్‌–3 ప్రాజెక్టులో భాగంగా నిర్వహించిన ప్రీలాంచ్‌ పరీక్ష విజయవంతమైందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మార్చి 16న ఇస్రో ప్రకటించింది.
Chandrayaan-3

ఈ వ్యోమనౌక కీలక పరీక్షలు పూర్తిచేసుకుని ప్రయోగానికి సిద్ధమయిందని తెలిపింది. నింగిలోకి దూసుకెళ్లే సమయంలో కంపనం, ధ్వనికి సంబంధించి ఎదురయ్యే కఠిన సవాళ్లను తట్టుకునే సామర్థ్యాన్ని విజయవంతంగా ధ్రువీకరించినట్లు ఇస్రో తెలిపింది. బెంగళూరులోని యుఆర్‌ రావు కేంద్రంలో మార్చి మొదటి వారంలోనే ఈ పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది. చంద్రుడిపైన ప్రొపల్షన్‌, ల్యాండర్‌, రోవర్‌ మాడ్యూళ్లతో కూడిన లూనార్‌ను క్షేమంగా దించడమే లక్ష్యంగా చంద్రయాన్‌–3 ప్రయోగాన్ని ఈ ఏడాది జూన్‌లో చేపట్టే అవకాశం ఉంది. కాగా 2019లో చంద్రయాన్‌–2 ప్రయోగం విఫలమైంది.  
ఈ మిషన్ కోసం ఇస్రో ప్రధానంగా మూడు లక్ష్యాలను నిర్దేశించుకుంది.  ఇందులో చంద్రుని ఉపరితలంపై సురక్షితమైన, మృదువైన ల్యాండింగ్‌ను ప్రదర్శించడం, చంద్రునిపై రోవర్ కక్ష్య సామర్థ్యాలను ప్రదర్శించడం, స్వంతంగా శాస్త్రీయ పరిశీలనలను నిర్వహించడం వంటివి ఉన్నాయి.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Science & Technology) క్విజ్ ( 12- 18 ఫిబ్రవరి 2023 )

Published date : 20 Mar 2023 12:49PM

Photo Stories