Chandrayaan-3 live updates: చంద్రయాన్–3 క్షణ క్షణ వివరాలు ఇవే..
శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) రెండో ప్రయోగవేదిక నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు ఎల్‌వీఎం3–ఎం4 ఉపగ్రహ వాహక నౌక ద్వారా ఈ ప్రయోగం జరగనుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లనూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇప్పటికే పూర్తి చేసింది.
ఎల్‌వీఎం–3 రాకెట్ విశేషాలు:
➤ ఎల్‌వీఎం–3 రాకెట్ బరువు 640 టన్నులు, పొడవు 43.5 మీటర్లు. 4,000 కిలోలపేలోడ్‌ను జియోసింక్రనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (జీటీఓ)లోకి మోసుకెళ్లగలదు.
➤ ఇందులో ప్రొపల్షన్ మాడ్యూల్ 2,145 కిలోలు, ల్యాండర్ 1,749 కిలోలు, రోవర్ 26 కిలోలుంటాయి.
➤ రాకెట్‌కు అవసరమైన శక్తిని సమకూర్చడానికి తగిన ఏర్పాట్లు చేశారు. ఇందులో రెండు సాలిడ్ స్ట్రాప్–ఆన్ మోటార్లు(ఎస్200), ఒక లిక్విడ్ కోర్ స్టేజ్(ఎల్110), 28 టన్నుల బరువైన ప్రొపలెంట్ లోడింగ్‌తో కూడిన ఒక హై–థ్రస్ట్ క్రయోజనిక్ అప్పర్ స్టేజ్(సీ25) ఉన్నాయి.
➤ ఈ రాకెట్‌ను మొదట ‘జీఎస్‌ఎల్‌వీ–ఎంకే3’గా వ్యవహరించేవారు. ఇస్రో దీనికి ఎల్‌వీఎం–3గా నామకరణం చేసింది. దీనిద్వారా ఇప్పటివరకూ 3 ప్రయోగాలు విజయవంతమయ్యాయి. చంద్రయాన్–3 నాలుగో ప్రయోగం కానుంది.
➤ చంద్రయాన్–2లో 14 పేలోడ్స్ పంపగా చంద్రయాన్–3లో 5 ఇస్రో పేలోడ్స్, 1 నాసా పేలోడ్‌ను మాత్రమే పంపుతున్నారు.
➤ భారతదేశంలో తొలి మానవ సహిత స్పేస్ క్రాఫ్ట్ ప్రయోగమైన గగన్‌యాన్ మిషన్‌లో ఎల్‌వీఎం–3 వాహక నౌక తన సేవలను అందించనుంది.
☛☛ chandrayyan-3 ready to launch: చంద్రయాన్–3 ప్రయోగానికి సిద్దం.. దీని ప్రత్యేకతలు ఇవే...
ఎలా పనిచేస్తుంది?
దశల వారీగా ఇంధనాన్ని మండించడం ద్వారా రాకెట్‌ను నింగిలోకి పంపిస్తారు. ఘన, ధ్రవ ఇంధన ఇంజిన్లు, స్ట్రాప్–ఆన్ బూస్టర్లు నిర్దేశిత సమయాల్లో పనిచేస్తాయి. ఎల్‌వీఎం–3లో విద్యుత్ సరఫరా కోసం రెండు వికాస్ ఇంజిన్లు ఉన్నాయి. ప్రాథమిక దశలో రెండు సాలిడ్ ప్రొపలెంట్ బూస్టర్లు అదనపు శక్తిని అందజేస్తాయి.
పేలోడ్ నిర్దేశిత కక్ష్యలోకి చేరుకోవడానికి అవసరమైన శక్తిని దేశీయంగా అభివృద్ధి చేసిన క్రయోజెనిక్ ఇంజిన్ సీఈ–20 సమకూరుస్తుంది. మొదట రెండు బూస్టర్లను ఒకేసారి మండిస్తారు. దాంతో రాకెట్ టేకాఫ్ అవుతుంది. తర్వాత లిక్విడ్ కోర్ స్టేజ్‌ను 113 సెకండ్లపాటు, రెండు ఎస్200 బూస్టర్లను 134 సెకండ్లపాటు మండిస్తారు. టేకాఫ్ తర్వాత 217 సెకండ్లకు భూమికి 115 కిలోమీటర్ల ఎత్తున శాటిలైట్‌తో కూడిన పేలోడ్ రాకెట్ నుంచి విడిపోతుంది.
☛☛ Chandrayaan-3 Count down starts: చంద్రయాన్–3 కౌంట్‌డౌన్ స్టార్ట్
➤ శ్రీహరి కోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్–3
➤ ఆగస్టు 23 లేదా 24న చంద్రుని మీద ల్యాండింగ్
➤ చంద్రయాన్–3 బరువు 3900 కిలోలు
➤ చంద్రుని ఉపరితలం మీద అధ్యయనవ చేయనున్న చంద్రయాన్–3
➤ మూడు దశలల్లో చంద్రయాన్–3
➤ రాకెట్ నుండి విజయవంతంగా శాటిలైట్
➤ భూ కక్షలోకి చంద్రయాన్–3
➤ 24 రోజుల పాటు భూ కక్షలో చంద్రయాన్–3
➤ 3.5 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది.
➤ ఇస్రో శాస్త్రవేత్తల సంబరాలు
➤ చంద్రయాన్–3 విజయంపై శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ
➤ చంద్రయాన్–3 విజయంపై శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన సియం జగన్
Chandrayaan-3 live updates 2023: