Skip to main content

Chandrayaan-3 Count down starts: చంద్రయాన్‌–3 కౌంట్‌డౌన్ స్టార్ట్‌

ప్రతిష్టాత్మక చంద్రయాన్‌–3 మిషన్‌ను చంద్రుని దక్షిణ ధ్రువంపైకి పంపేందుకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో సర్వం సిద్దమైంది.
chandrayaan-3
chandrayaan-3

శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) రెండో ప్రయోగవేదిక నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు  ఎల్‌వీఎం3–ఎం4  ఉపగ్రహ వాహక నౌక ద్వారా ఈ ప్రయోగం జరగనుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లనూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇప్పటికే పూర్తి చేసింది.

పెరిగిన కౌంట్‌డౌన్‌...

ఎల్‌వీఎం3–ఎం4 ప్రయోగానికి 25 గంటల పై చిలుకు కౌంట్‌డౌన్‌ గురువారం మధ్యాహ్నం 1.05కు మొదలైంది. ముందుగా 24 గంటలే అనుకున్నా సాంకేతిక సమస్యలతో సమయా­న్ని గంటన్నర పాటు పెంచారు. రాకెట్‌కు రెండో దశ ఎల్‌–110లో ద్రవ ఇంధనం నింపే ప్రక్రియను గురువారం అర్ధరాత్రికే పూర్తి చేశారు. అనంతరం లెవెల్‌ 1, 2 తనిఖీలు, రాకెట్‌లో హీలియం నింపడం, ఎలక్ట్రికల్‌ తదితర వ్యవస్థలను సరిచూసుకోవడం వంటివి జరుగుతాయి.

☛☛chandrayyan-3 ready to launch: చంద్రయాన్‌–3 ప్ర‌యోగానికి సిద్దం.. దీని ప్ర‌త్యేక‌త‌లు ఇవే...

Published date : 14 Jul 2023 01:27PM

Photo Stories